తానా సభ్యుల సేవానిరతికి జనం జేజేలు పలుకుతున్నారు. తమ సొంత గ్రామాల్లో తానా సభ్యులు అసహాయులకు, విద్యార్థులకు చేస్తున్న సేవలను అందరూ కొనియాడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తానా సభ్యులు ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా మహమూబ్ నగర్ జిల్లాలోనూ ప్రభుత్వ పాఠశాలలకు కాలినడకన నడిచి వస్తున్న విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసి తన ఉదారత చాటుకున్నారు.

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం గోపాలపురం ఉన్నత పాఠశాలలో 13మంది బాలికలకు TANA ఆదరణ కార్యక్రమంలో భాగంగా 13 సైకిళ్ళు అందజేశారు. TANA ఫౌండయిన్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట రమణ గారి చేతుల నుండి సాయం పొందినా ఈ మారుమూల గిరిజన గ్రామాలనుంచి నడిచి వస్తున్న ఆడపిల్లల మోహల్లో చిరునవ్వులు విరబూస్తున్నాయి..

పాఠశాల సమయం ముగిసిన తరువాత బిక్కుబిక్కుమంటూ డొంక రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే ఈ అమ్మాయిలు రవి సామినేని వారికి, TANA దాతలకు ధన్యవాదాలు తెలుపుతున్నారు..


