Homeప్రవాస భారతీయులుSwaralaya Singapore: ఘనంగా సింగపూర్‌ స్వరాలయ వార్షికోత్సవం..

Swaralaya Singapore: ఘనంగా సింగపూర్‌ స్వరాలయ వార్షికోత్సవం..

Swaralaya Singapore: సింగపూర్‌కు చెందిన స్వరాలయ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ ఐదో వార్షికోత్సవం 2024, మార్చి 3న ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ వైరెడ్డి శ్యామల, పీఠాధిపతి, భాషాభివృద్ధి పీఠం, డైరెక్టర్‌ ఐ/సి, అంతర్జాతీయ తెలుగు కేంద్రం, పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం విచ్చేసి మాట్లాడారు. తెలుగు భాష ప్రాముఖ్యతను వివరించారు. అన్నమయ్య పద మాధుర్యం గురించి మాట్లాడారు.

అలరించిన గానం..
ఇక వీరు శేషుకుమారి గానం, ప్రత్యూష నాట్యా మేళవించి మధురమైన భావనతో ప్రేక్షకులను మైమరిపించారు. కార్యక్రమానికి కార్యక్రమానికి ఎస్‌టీఎస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జ్యోతీశ్వర్, టీఏఎస్‌(మనం తెలుగు) అసోసియేషన్‌ అనితరెడ్డి, శ్రీ సాంస్కృతిక కళా సారథి రత్న కుమార్, కమల క్లబ్‌ అధ్యక్షుడు, సారీ కనెక్షన్‌ అడ్మిన్‌ పద్మజ నాయుడు, మగువ మనసు అడ్మిన్‌ ఉష, సింగపూర్‌ తెలుగు వనితలు అడ్మిన్స్‌ శ్రీక్రాంతి, జయ, ప్రత్యూష, సింగపూర్‌ సుమన్‌ టీవీ అరుణ, సింగరూర్‌ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయ్యారు.

చిన్నారుల కీర్తనలు..
స్వరాలయ ఆర్ట్స్ సింగపూర్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేశుకుమారి శిష్యులు కీర్తనలు ఆలపించారు. స్వరాలయ ఆర్ట్స్, సింగపూర్‌కు అనుబంధ సంస్థ అభినయ నాట్యాలయ చిన్నారులు ప్రత్యూష, శిష్యులు నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఇక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికెట్‌ కోర్సు మొదటి సంవత్సరం ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్‌ విద్యార్థులకు ప్రొఫెసర్‌ వైరెడ్డి శ్యామల సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అతిథులకు యడవల్లి శేషుకుమారి, ప్రొఫెషర్‌ వైరెడ్డి శ్యామల మెమొంటోలు బహూకరించారు. శివకుమార్‌ మృదంగంపై వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమానికి సౌజన్య, ఆచంట ప్రసన్న వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular