TANA Foundation: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) లో ముఖ్యమైన విభాగం ఫౌండేషన్. తానా ఎన్నికలపై మొన్నటి వరకు నెలకొన్న వివాదానికి తెరపడింది. ఎన్నికల వివాదం సద్దుమణగడంతో అంతర్గత కమిటీల ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఫౌండేషన్ కొత్త కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నారు.
కార్యవర్గం ఇదీ..
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఫౌండేషన్ చైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి నియమితులయ్యారు. సంయుక్త కోశాధికారిగా కిరణ్ గోగినేని ఎన్నికయ్యారు. తానా ఫౌండేషన్ చేయూత కార్యక్రమం కోఆర్డినేటర్‌గా సేవలందించిన శశికాంత్ తాజాగా ఫౌండేషన్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. గతంలో ఆయన ఫౌండేషన్ కోశాధికారిగా, కార్యదర్శిగా, బోస్టన్ తెలుగు అసోసియేషన్ బోర్డు చైర్మన్‌గా కూడా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
కొత్త సభ్యుల ఎన్నికకు బోర్డ్ ఆమోదముద్ర
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా కొత్త సభ్యుల ఎన్నికపై దాదాపు మూడు నెలలుగా నెలకొన్న ప్రతిష్టంభన వీడింది. కొత్త సభ్యుల ఎన్నికకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. దీంతో ఎన్నికలపై వివాదం సమసిపోయింది. ఇటీవలే బోర్డు సమావేశంలో ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదల గురించి చర్చించారు. ఫిర్యదులన్నీ తోసిపుచ్చారు. కొత్త బోర్డు సభ్యులకు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల నియామకానికి ఆమోద ముద్ర వేశారు.
మార్చి 1న బాధ్యతల స్వీకరణ..
ఇదిలా ఉండగా కొత్త కమిటీ సభ్యులు మార్చి 1న కొత్త బోర్డు, పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరిస్తారని ప్రస్తుత బోర్డు చైర్మన్ హనుమయ్య బండ్ల ప్రకటించారు. ఎన్నికల కమిటీ ఫలితాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో ప్రనెసిడెంట్‌గా నరేన్ కొడాలి, ఆయన టీం సభ్యులు బాధ్యతలు చేపట్టారు.