Russia: రష్యారాజధాని ఉలిక్కిపడింది. ఆ దేశ రాజధాని మాస్కోలోని ఓ షాపింగ్‌మాల్‌పై శుక్రవారం(మార్చి 22న) ఉగ్రవాదులు దాడి చేశారు. బాంబులతో దాడి చేయడంతోపాటు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 40 మందికిపైగా మృతిచెందినట్లు తెలిసింది. వందమందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. మరో వంద మందిని పోలీసులు కాపాడారు.
ఐదుగురు ఉగ్రవాదులు..
మాస్కోలోని ఓ షాపింగ్ మాల్‌లోకి చొరబడిన ఐదుగురు ఉగ్రవాదులు మొదట బాంబులు విసిరారు. తర్వాత విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతంలో బీతావాహ వాతావరణం నెలకొంది. మాల్‌లోని ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. కేకలు వేశారు.
చుట్టు ముట్టిన పోలీసులు..
సమాచారం అందుకున్న పోలీసులు మాల్‌ను చుట్టుముట్టారు. సుమారు 100 మందిని షాపింగ్ మాల్ నుంచి బయటకు తీసుకువచ్చారు. ఇంకా వందలాది మంది మాల్‌లో ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు 70 అంబులెన్స్‌లను అక్కడికి రప్పించారు. అందరినీ కాపాడేందుకు పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
హెచ్చరించిన అమెరికా..
ఇదిలా ఉంటే రష్యాపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని అమెరికా మార్చి 8న హెచ్చరించింది. ఈమేరకు రష్యాలోని రాయబార కార్యాలయానికీ సమాచారం ఇచ్చింది. రాబోయే రెండు రోజుల్లనే దాడి జరుగుతుందని హెచ్చరించింది. రాబోయే 48 గంటలు గుమి కూడవద్దని తమ దేశ పౌరులకు సూచించింది. ఈ హెచ్చరికలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపినా.. అమెరికా హెచ్చరించిందే జరిగింది. కాస్త ఆలస్యమైనా ఉగ్రదాడి జరిగింది. మార్చి 24న మాస్కోలోని షాపింగ్ మాల్‌పై ఉగ్రవాదులు దాడిచేశారు.
ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగానే..
రష్యాపై ఉగ్రదాడికి ప్రధాన కారణం ఉక్రెయిత్‌తో యుద్ధమే అని అంటున్నారు నిపుణులు. ఉక్రెయిన్‌పై రెండేళ్లుగా జరుపుతున్న దాడులతో ఆదేశం వల్లకాడును తలపిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌కు అమెరికా సాయం అందిస్తోంది. మొత్తంగా ఉగ్రదాడి రష్యాలో కలకలం రేపింది.