spot_img
Homeఅంతర్జాతీయంTACA Sankranti Celebrations: కెనడాలో సంక్రాంతి సంబురాలు.. తాకా ఆధ్వైర్యంలో అంబరాన్నంటిన వేడుకలు

TACA Sankranti Celebrations: కెనడాలో సంక్రాంతి సంబురాలు.. తాకా ఆధ్వైర్యంలో అంబరాన్నంటిన వేడుకలు

TACA Sankranti Celebrations: తెలుగువారు జరుపుకునే ప్రధాన పండుగుల్లో మకర సంక్రాంతి ఒకటి. మూడు రోజులు జరుపుకునే ఈ వేడుకను ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా జరుపుకుంటారు. తాజాగా కెనడా(Canada)లోనూ తాకా(TACA) తెలుగులయెన్సెస్‌ ఆఫ్‌ కెనడా Telugu Allancese Of Canada ఆధ్వర్యంలో 2025, జనవరి 11న టోరంటోలో బ్రాంప్టన్‌ చింగువాకూసి సెకండరీ స్కూల్‌ ఆడిటోరియంలో నిర్వహించారు. 1200 మంది తెలుగువారు ఈ సంబురాల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తాకా అధ్యక్షులు రమేశ్‌ మునుకుంట్ల వేడుకలను ప్రారంభించారు. కోశాధికారి మల్లిఖార్జునాచారి సభికులను ఆహ్వానించారు. ధనలక్ష్మి మునుకుంట్ల, విశారద పదిర, వాణ జయంతి, అనిత సజ్జ, ప్రశాంతి పిన్నమరాజు, అశ్విత అన్నపురెడ్డి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంబమయ్యాయి.

కెనడా జాతీయ గీతాలాపనతో..
వేడుకలు జనవరి 11న సాయంత్రం 5:30 గంటలకు ప్రాంభించారు. కెనడా జాతీయ గీతాలాపనతో మొదలైన సాంస్కృతిక కార్యక్రమాలు సుమారు 5 గంటలపాటు అంటే రాత్రి 10:30 గంటల వరకు కొనసాగాయి. సంక్రాంతి పండుగ సంప్రదాయలతో ప్రముఖ పురోహితులు శ్రీమంజునాథ్‌ ధ్వర్యంలో పిల్లలకు భోగిపంళ్లు పోశారు. గారు జరిపించగా, తల్లిదండ్రులు, ముత్తయిదువులు పండుగ సంస్కృతిని కొనసాగిస్తూ ఆశీర్వదించారు. కెనడా పార్లమెంటు సభ్యుడు చంద్రకాంత్‌ ఆర్య వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కెనడా తూర్పు కాలమానం(East Canada Timings) ప్రకారం తెలుగు అతిథులు నక్షత్రాలతో తయారు చేసిన తాకా 2025 క్యాలెండర్‌(Calendar)ఆవిష్కరించారు.

TACA Sankranti Celebrations(1)
TACA Sankranti Celebrations(1)

ప్రముఖుల ప్రసంగాలు..
ఈ కార్యక్రమ వ్యాఖ్యాతలుగా అనిత సజ్జ, ప్రశాంతి పిన్నమరాజు, అశ్విత అన్నపురెడ్డి వ్యవహరించారు. ఇక ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు మాట్లాడారు. తాకా వ్యవహారిక కార్యక్రమములో అధ్యక్షులు రమేశ్‌ మునుకుంట్ల మాట్లాడుతూ తెలుగు కళలు, పండుగలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కెనడాలోని తెలుగు వారందరూ కొనసాగిస్తూ ముందు తరాలకు అందజేయుటకు తాకా చేస్తున్న కృషిలో కెనడాలోని ప్రవాస తెలుగు వారందరూ పాల్గొన వలసినదిగా కోరారు. ఫౌండేషన్‌ కమిటీ చైర్మన్‌ అరుణ్‌ కుమార్‌ లాయం మాట్లడుతూ శ్రీపద్మావతి మహిళావిశ్వవిద్యాలయంతో సంగీతం, నాట్యంలో డిప్లొమా, డిగ్రీ కోర్సులు కెనడాలో బోధన కోసం తాకా ఒప్పందం కుదుర్చుకొన్నట్లు తెలిపారు. త్వరలోనే తరగతులను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. తాకా ముఖ్య ఫౌండర్‌ హనుమంతాచారి సామంతపుడి, సభికులనుద్దేసించి ప్రసంగించారు.

విజేతలకు బహుమతులు..
వేడుకలకు ముందు నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పండుగ సంబరాలలో తాకావారు పన్నెండు రకాల వంటకాలతో ఏర్పాటుచేసిన రుచికరమైన తెలుగు భోజనం అందరూ ఆరగించి తాకా కమీటీ సభ్యుల కృషిని కొనియాడారు. అధక్షుడు రమేశ్‌ మునుకుంట్ల మాట్లాడుతూ తాకా ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం, తెలుగు జాతి కీర్తిని పెంచేందుకు తెలుగు వారందరినీ ఒకేవేదికపైకి తీసుకురావడం ముఖ్యం కాగా, అందు కోసం సహకరిస్తున్న గ్రాండ్‌ స్పాన్సర్‌ శ్రీరామ్‌ జిన్నాల, ప్లాటినం స్పాన్సర్లు హైదరాబాద్‌ హౌస్‌ మిస్సిస్సౌగా రెస్టారెంటు, సన్లైట్‌ ఫుడ్స్‌ , గోల్డు స్పాన్సర్లు మరియు సిల్వర్‌ స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

TACA Sankranti Celebrations(2)
TACA Sankranti Celebrations(2)

వేడుకల్లో వీరు..
తాకా సంక్రాంతి సబురాల్లో బోర్డు ట్రస్టీ వాణి జయంతి, సంక్రాంతి పండుగకు సహకరించిన స్పాన్సర్లు, దిజిటల్‌ స్క్రీన్‌ టీం, డీజే టీం, డెకోరేషన్‌ టీం, ప్రంట్‌ డెస్క్‌ టీం, ఫుడ్‌ టీం, ఆడియో వీడియో టీం , వలంటీర్లను సమన్వయ పరచిన శ్రీ గిరిధర్‌ మోటూరి, మరియు పీల్‌ డిస్త్రిక్టు స్కూలుబోడు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. వేడుకల్లో అధ్యక్షుడు రమేశ్‌ మునుకుంట్ల, ఉపాధ్యక్షులు రాఘవ్‌ అల్లం, కోశాధికారి మల్లిఖార్జునాచారి పదిర, సాంస్కృక కార్యదర్శి అనిత సజ్జ, డైరక్టర్లు ప్రదీప్‌ కుమార్‌రెడ్డి ఏలూరు, యూత్‌ డైరక్టర్లు సాయి కళ్యాణ్‌ వొల్లాల, శ్రీమతి ప్రశాంతి పిన్నమరాజు, అశ్విత అన్నపురెడ్డి, రాజా అనుమకొండ, ఎక్స్‌ అఫిసియో సభ్యురాలు కల్పన మోటూరి, ఫౌండెషన్‌ కమిటీ చైర్మన్‌ అరుణ్‌ కుమార్‌ లాయం, ట్రస్టీలు వాణి జయంతి, పవన్‌ బాసని, ఫౌండర్‌ హనుమంతాచారి సామంతపుడి, శ్రీనాథ్‌ కుందూరి పాల్గొన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Oktelugu Epaper