Tana 23rd conference : తెలుగు వారు ఎక్కడున్నా.. ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని అని స్మరిస్తూనే ఉంటారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. అమెరికాలోనూ తెలుగు వెలుగును చాటుతున్నారు. మన అన్న తారక రాముడి శతజయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు.
జులై 8, శనివారం ఉదయం 10 గంటలకు పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్‌లో జరగనున్న తానా 23 కాన్ఫరెన్స్‌లో జరిగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. తెలుగు వారి ఇలవేలుపు .. తెలుగుదనానికి ప్రతిరూపు అన్న నందమూరి తారక రామునికి ఘనంగా నివాళిలర్పిస్తూ ఎన్నో ఆకర్షణీయమైన కార్యక్రమాలు నిర్వహిచబడుతున్నాయి. అద్భుతమైన తారక రాముని ప్రాంగణం, ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కకరణ, ఎన్టీఆర్ జీవితం లోని ముఖ్యమైన మైలురాళ్లను వర్ణించే అరుదైన ఛాయాచిత్రాల ఫోటో ఎగ్జిబిట్, ఎన్టీఆర్ యొక్క శాశ్వతమైన సాంస్కృతిక ప్రభావానికి నివాళులర్పిస్తూ, నృత్యం, సంగీతం మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు, అన్న ఎన్‌టిఆర్ ఆశయ స్పూర్తితో అర్థవంతమైన సేవా కార్యక్రమాలు, ఫోటో బూత్‌లు వెరసి తానా లోకంలో తారక రాముని శతజయంతి ఉత్సవాలు ఒక చారిత్రకమైన ఘట్టంగా చెప్పొచ్చు.
ఒక యుగపురుషుడికి నివాళులు అర్పించే మహత్తర అవకాశం తానా నుంచి ప్రవాస భారతీయులు, తెలుగు వారికి దక్కుతోంది.. మీ సహకారం – భాగస్వామ్యం కోరుకుంటూ .. రండి … కదలి రండి అంటూ తానా సభ్యులు ఆహ్వానిస్తున్నారు.
తానా మహాసభలకు రావాలనుకునే వారు ఈ నంబర్లలో సంప్రదించండి..
https://tanaconference.org/event-registration.html