NATS: నాట్స్(నార్త్ అమెరికా తెలుగు సొసైటీ)(North America Telugu Society) అధ్యక్షుడిగా మదన్ పాములపాటి(Madan Pamulapati) ఎంపికయ్యారు. 2024–26 కాలానికి ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని నాట్స్ బోర్డు పేర్కొంది. నాట్స్ షికాగో విభాగంలో చురుగ్గా వ్యవహరించిన మదన్ పాములపాటి గతంలో పలుసేవా కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించారు. రెండుసార్లు నాట్స్ కోశాధికారిగా, సంబరాల కమిటీ కార్యదర్శి, ఉపాధ్యక్షుడి(సేవలు)గా బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో నాట్స్ అధ్యక్ష పదవికి బోర్డు ఆయనను ఎంపిక చేసింది.
Also Read: US Spelling Bee: అమెరికా ఆంగ్లంలో తెలుగోడి సత్తా.. అమెరికా స్పెల్లింగ్ బీ ఛాంపియన్!
కీలక పదవుల్లో వీరు..
ఇక నాట్స్ కమిటీ ఉపాధ్యక్షుడిగా శ్రీనివాసరావు భీమినేని(ఆపరేషన్స్) హేమంత్ కొల్లా(ఆర్థికం), భానుప్రకాశ్ ధూళిపాళ్ల(ప్రోగ్రామ్స్), కార్యదర్శిగా రాజేశ్ కాండ్రు, కార్యనిర్వాహక కార్యదర్శులుగా మురళి మేడిచర్ల(మీడియా), రవి తుమ్మల(వెబ్), ట్రెజరర్‌గా సుధీర్ మిక్కిలినేని, సంయుక్త ట్రెజరర్‌గా రవి తాండ్ర నియమితులయ్యారు.
Also Read: Mangoes: అమెరికా నుంచి ఆఫ్రికా దాకా.. మామిడి పండ్లంటే ఓ ఎమోషన్.. వీడియో వైరల్
కార్యవర్గంలో..
నాట్స్ కార్యవర్గంలో శ్రీనివాస్ మెంటా, వెంకటరావు దగ్బుటి, సుమత్ రామినేని, సత్య శ్రీరామనేని, శ్రీహరీశ్, జమ్ముల, మనోహర్‌రావు మద్దినేని, భాను లంకా, ఎమ్మాన్యుయెల్, కిశోర్, నారె, సంకీర్త్ కంటకం, కిరణ్ మందాడి, ఆర్కే బాలినేని, రాజలక్ష్మి చిలుకూరి, కిశోర్ గరికపాటి, వెంకట్ మంత్రి, ఫాలా„Š అవస్థి వివిధ బాధ్యతలు చేపట్టనున్నారు.