Canada MP: అమ్మ భాషలో ప్రమాణం.. కెనడాలో ప్రత్యేకత చాటుకున్న భారత సంతతి ఎంపీ

కెనడాలో ఎంపీగా ఎన్నికైన ప్రవాస భారతీయుడు చంద్రఆర్య అక్కడి పార్లమెంటులో కన్నడ భాషలో ప్రమాణస్వీకారం చేశాడు. మాతృభాషపై తనకున్న మమకారాన్ని చాటుకున్నాడు.

Written By: Raj Shekar, Updated On : June 11, 2024 10:49 am

Canada MP

Follow us on

Canada MP: ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారిలో చాలా మంది తమ మాతృభాషలో కాకుండా ఇంగ్లిష్‌లో ప్రమాణస్వీకారం చేసే రోజులివి. రెండు రోజుల క్రితం భారత ప్రధానిగా నరేంద్రమోదీతోపాటు 71 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. చాలా మంది జాతీయ భాష హిందీలో ప్రమాణం చేశారు. కొందరు మాత్రం ఇంగ్లిష్‌లో ప్రమాణం చేశారు. మన దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఎంపీలుగా ఎన్నికైన ఎంపీల్లో ఒక్కరు కూడా వాళ్లు మాతృభాషలో ప్రమాణం చేయలేదు.

కెనడా భారత సంతతి ఎంపీ ఇలా..
కానీ కెనడాలో ఎంపీగా ఎన్నికైన ప్రవాస భారతీయుడు చంద్రఆర్య అక్కడి పార్లమెంటులో కన్నడ భాషలో ప్రమాణస్వీకారం చేశాడు. మాతృభాషపై తనకున్న మమకారాన్ని చాటుకున్నాడు. చంద్రఆర్య కన్నడలో ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సహచర ఎంపీలు సీట్లలో నుంచి లేచి ఆయనను అభినందించారు. వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

గతంలో కూడా..
ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని.. నిలపరా నీజాతి నిండు గౌరవము అని జాతీ గౌరవం పెంచే గీతం రాశారు రాయప్రోలు సుబ్బారావుగారు. వివిధ వృత్తుల కోసం విదేశాలకు వెళ్లిన అనేక మంది భారత సంతతి వ్యక్తులు ఇప్పుడు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్నారు. ఇప్పటికీ మాతృ భూమి, మాతృ భాషపై మమకారం చాటుకుంటున్నారు. ఈ క్రమంలో కెనడాకు చెందిన కన్నడ ఎంపీ తన మాతృభాషలో ప్రమాణం చేయడాని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఎంత ఎదిగినా ఎక్కడికి వెళ్లినా మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది మరచిపోవద్దని పేర్కొంటున్నారు.