Lok Sabha Election 2024: ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత దేశం. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయంటే.. ప్రపంచమంతా మనవైపే చూస్తుంది. ప్రస్తుతం 18వ లోక్‌సభ కోసం సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈసీ. ఇప్పటికే ఏప్రిల్ 19న మొదటి విడత ఎన్నికలు జరిగాయి. రెండో విడత ఎన్నికలు ఏప్రిల్ 26న జరుగబోతున్నాయి.
ఎన్నారైల ఉత్సాహం..
ఈసారి ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములయ్యేందుకు ప్రవాస భారతీయులు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా కేరళ నుంచి విదేశాలకు వెళ్లినవారిలో.. వేల మంది స్వదేశీ బాట పట్టారు. ఇందుకోసం ప్రత్యేక విమానాలను ఆశ్రయిస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే దాదాపు 22వేలకు పైగా ఎన్నారైలు కేరళకు వచ్చినట్లు అంచనా. కేరళలో 20 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది.
ఎన్నారై ఓటర్లు 89 వేల మంది..
ఇక కేరళ రాష్ట్రంలో ఎన్నారై ఓటర్లుగా 89,839 మంది నమోదు చేసుకున్నారు. కోజికోడ్‌లో(సుమారు 36 వేలు), మళప్పురంలో(15 వేలు), కన్నూర్‌లో (13 వేలు)తోపాటు పళక్కడ్, వయనాడ్, వడకర ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్నారు. వీరిని పోలింగ్‌లో భాగస్వామ్యం చేసేందుకు రాజకీయ పార్టీలు విదేశాల్లోనూ ప్రచారం చేశాయి. స్వదేశానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశాయి.
ఓటు హక్కు కోసం..
ఇక మాతృ దేశ భవిష్యత్‌ను నిర్దేవించే ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించేందుకు కేరళ వాసులు స్వరాష్ట్రానికి వస్తున్నారు. కేరళలో అక్షరాస్యత శాతం కూడా ఎక్కువ. అందుకే ప్రజాస్వామ్యంపై గౌరవం కూడా ఎక్కువే. అందుకే ప్రనజాస్వామ్య పరిరక్షణకు మేమే సైతం అంటూ ఖర్చుకు వెనుకాడకుండా స్వదేశానికి తరలి వస్తున్నట్లు రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు.