America Richest Women List: ఒకప్పుడు చాలా మంది మహిళలు వంటింటికే పరిమితం అయ్యారు. కాలం మారుతున్న కొద్దీ వీరు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ఉద్యోగం, వ్యాపారం ఏదైనా తమ ప్రతిభతో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తున్నారు. దేశంలోని కాకుండా విదేశాల్లోని భారత సంతతికి చెందిన మహిళలు వివిధ రంగాల్లో దూసుకెళ్తున్నారు. అమెరికా వైస్ ప్రెసడెంట్ గా కమలా హారీస్ దేశంలోని చెన్నై ప్రాంతానికి చెందిన మహిళ అని చెప్పుకోవడం గర్వకారణం. తాజాగా భారత్ కు చెందిన మహిళలు అమెరికాలోని సంపన్నుల జాబితాలో చోటు సంపాదించారు. ‘స్వయం కృషితో ఎదిగిన మహిళా సంపన్నులు’ జాబితాను ప్రముఖ ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలిగా డైనీ హెండ్రిక్స్ నిలిచారు. ఆమె వరుసగా ఆరోసారి ఈ స్థానంలోకే కొనసాగుతున్నారు. తొలి 100 మంది మహిళల్లో భారత సంతతికి చెందిన వారు 4గురు ఉండడం విశేషం. వారి గురించి వివరాల్లోకి వెళ్తే..
Jayasri ఉల్లాల్:
న్యూఢిల్లీకి చెందిన కుటుంబం లండన్ లో స్థిరపడింది. ఈ ఇంట్లో Jayasri జన్మించారు. ఉల్లాల్ మొదటిసారిగా అడ్వాన్స్ డ్ మైక్రో డివైసెస్ లో సీనయిర్ స్ట్రాటజిక్ డెవలప్ మెంట్ ఇంజనీర్ గా వృత్తిని ప్రారంభించారు. ఆ తరువాత ఫఎయిర్ చైల్డ్ సెమీ కండక్టర్ లో చేరింది. అక్కడ ఐబీఎం, పిటాచీ కోసం హై స్పీడ్ మెమరీ చిప్ లను రూపొందించింది. 1988లో ఆమె ఉంజర్ మాన్ బాస్ లో చేరారు. 1992 మార్చిలో మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ గా ఫైబర్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా ఇంటర్ ఫేస్ నెట్ వర్క్ ఉత్పత్తుల తయారీదారి అయిన క్రెసెండో కమ్యూనికేషన్ లో చేరారు. 2008 నుంచి అరిస్టా నెట్ వర్క్ ప్రెసిడెంట్ గా, సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె నికర ఆదాయ విలువ 2.4 బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ జాబితాలో ఆమె 15వ స్థానంలో ఉన్నారు.
Nirza సేథీ:
Nirza సేథీ గణితంలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, కంప్యూటర్ లో మాస్టర్ డిగ్రీని చేశారు. భర్త భరత్ దేశాయ్ తో కలిసి 1980లో కన్సల్టింగ్, ఔట్ సోర్సింగ్ సంస్థ అయిన ‘సింటెల్’ను స్థాపించారు. మిచిగాన్ లోని ట్రాయ్ అపార్టమెంట్ లో ఈ సంస్థ కొనసాగుతుంది. ప్రారంభంలో 2 వేల డాలర్లతో ప్రారంభించిన ఈ బిజినెస్ అంచెలంచెలుగా అభివృద్ధి సాధించింది. ప్రస్తుతం కంపెనీలో నీర్జాసేథి వాటా 510 మిలియన్ డాలర్లు ఉన్నట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆమె 990 మిలియన్ డాలర్ల ఆదాయంతో 25వ స్థానంలో కొనసాగుతున్నారు.
Neha నార్ఖడే:
పూణెకు చెందిన Neha నార్ఖడే జార్జియా టెక్ లో కంప్యూటర్ సైన్స్ చేశారు. ఆ తరువాత లింక్ డిన్ అనే సోషల్ మీడియా సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. 2014లో ఈ సంస్థను వీడి ఇద్దరు సహ ఉద్యోగులతో కలిసి కాన్ ఫ్లూయెంట్ ను స్థాపించారు. ఇందులో నేహ కు 6 శాతం వాటా ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది. ప్రస్తుతం ఆమె 520 డాలర్ల సంపదతో 50వ స్థానంలో ఉన్నారు.
Indra నూయీ:
పెప్సికో మాజీ సీఈవో అయిన Indra నూయీ అందులో 24 సంవత్సరాల పాటు పనిచేసి ఆరోగ్యకరమైన ఉత్పత్తులను అందించారు. అయితే 2019లో ఈ సంస్థ నుంచి పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం అమెజాన్ లో బోర్డు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 350 మిలియన్ డార్ల సంపదతో Indra నూయీ 77వ స్థానంలో ఉన్నారు.