Homeప్రవాస భారతీయులుLife In Usa Challenges For Indians: "అమ్మో" రికా.. ఇవాళ గడిస్తే.. రేపటి పరిస్థితి...

Life In Usa Challenges For Indians: “అమ్మో” రికా.. ఇవాళ గడిస్తే.. రేపటి పరిస్థితి ఏంటో..

Life In Usa Challenges For Indians: ఇల్లు దాటితే కారంటారు. ఐదు రోజుల పని అంటారు. కొవ్వు మాత్రం కొయిస్తారు. ఫారిన్ జీవులు స్పీడు మనుషులు.. ఏసీ లైఫ్ లో లేజీ బతుకులివి.. ఈస్ట్ లైఫ్ వేస్ట్ మామ.. మన వెస్టులైపే బెస్ట్ మామ.. అప్పట్లో వెన్నెల అనే సినిమాలో వచ్చిన పాట ఇది. కొన్ని దశాబ్దాల క్రితమే అమెరికా జీవితం గురించి ఆ పాటలో వర్ణించారు. ఆ పాటకు అప్పట్లో పరిస్థితులకు పెద్దగా తేడా ఉండేది కాదు. ఇప్పుడైతే నూటికి నూరు శాతం సరిపోతుంది.

వీసాలు ఒక సమస్య. ఉద్యోగం ఒక సమస్య. బయటికి వెళ్తే ఒక సమస్య. అసలు అక్కడ ఉండడమే ఒక సమస్య. కష్టపడి చదువుకొని.. ఉద్యోగం సంపాదించి.. భారీగా వేతనం అందుకుంటుంటే ఏదో ఒక రూపంలో అక్కడ దాడి జరుగుతూనే ఉంటుంది. కొంతమంది రాక్షస మూకలు పైశాచికంగా కాల్పులు జరుపుతుంటాయి. కేసులు, విచారణ, శిక్ష అనే విషయాన్ని పక్కన పెడితే.. పోయిన ప్రాణాలు మాత్రం తిరిగి రావు. అమెరికాలో కొంతమంది దుర్మార్గుల వల్ల ప్రాణాలు కోల్పోయిన భారతీయులు చాలామంది ఉన్నారు. ఆ జాబితా గురించి ఇక్కడ చెబితే పెద్ద లిస్ట్ అవుతుంది.

అమెరికా లో విలాసవంతమైన జీవితాన్ని.. డాలర్ల వర్షాన్ని ఒకప్పుడు గొప్పగా వర్ణించేవారు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అక్కడ జీవితం గురించి రకరకాలుగా రీల్స్.. షార్ట్స్ కనిపిస్తూనే ఉంటాయి. కానీ అక్కడ పరిస్థితి అందులో చెప్పినంత గొప్పగా ఉండదు. అమెరికా వెళ్లాలంటే ముందుగా గుండె ధైర్యం ఉండాలి. ఒంటరిగా బతకాలి అనే తెగువ ఉండాలి. దేన్నైనా గట్టిగా ఎదుర్కొనే దమ్ము ఉండాలి.. ఉదాహరణకి పూణే నగరానికి చెందిన తన్వి పిసల్ అని అమ్మాయి జీవితాన్ని తీసుకుంటే.. అమెరికా జీవితం ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. తన్వి అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో యాపిల్ కార్యాలయంలో ప్రతి ఏడాది 1.10 కోట్లు సంపాదిస్తున్నారు. అక్కడ ఆమె యూ ఎక్స్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. యాపిల్ కంపెనీలో ఉద్యోగం ఉన్నప్పటికీ.. ఆమె మాటల్లో ధైర్యానికంటే భయమే ఎక్కువ కనిపిస్తోంది.. పూణే నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆమె తన జీవితాన్ని మొదలుపెట్టారు. అప్పట్లో ఆమెకు ప్రతియడానికి 3.5 లక్షలు మాత్రమే వచ్చేవి. అయితే ఆమెకు మొదటి నుంచి కూడా సృజనాత్మకత అంటే చాలా ఇష్టం. అందువల్ల డిజైనింగ్ లోకి వచ్చారు. 2021లో అమెరికాలో మాస్టర్స్ చేసేందుకు వెళ్లారు. అక్కడ ఆమెకు ప్రతి సందర్భంలోనూ చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తనుండే క్యాంపస్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం కూడా ఇబ్బందిగా మారింది. చదువును పూర్తి చేసిన అనంతరం 2023లో ఆమె ఐడి కంపెనీలో నెలకు 5 లక్షల వేతనంతో చేరారు.. ఆ తర్వాత ఆమెకు అమెరికాలో జాబ్ మార్కెట్ ఎంత దారుణంగా ఉంటుందో అర్థమైంది. గత ఏడాది అక్టోబర్లో ఆమె పని చేస్తున్న కంపెనీ లే ఆఫ్ ప్రకటించింది. దీంతో తన్వి ఉద్యోగం పోయింది.

అనంతరం మరో ఉద్యోగాన్ని సంపాదించడానికి తన్వికి చాలా సమయం పట్టింది. దాదాపు 10 రౌండ్లపాటు ఇంటర్వ్యూలు దాటుకొని న్యూయార్క్ ప్రాంతంలోని ఓ సంస్థలో చేరారు. కేవలం రెండు వారాల్లోనే కాలిఫోర్నియా ప్రాంతం నుంచి న్యూయార్క్ కు తన మకాం మార్చాల్సి వచ్చింది. కేవలం 12 రోజుల్లోనే ఆ సంస్థ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది.. దానికి చెప్పిన కారణం రాత్రి 9 గంటల తర్వాత ఆమె కార్యాలయంలో ఉండకపోవడం వల్లే ఉద్యోగం నుంచి తొలగించామని ఆ సంస్థ చెప్పింది.. అప్పటికి ఆమె చేతిలో వీసా ఉంది. కాకపోతే దాని గడువు 60 రోజులు మాత్రమే. అప్పటిలోగా ఆమెకు గనుక ఉద్యోగం దొరకకపోతే మళ్లీ ఇండియాకు వెళ్లిపోవాలి. ఈ నేపథ్యంలో తన్వి ఒక యుద్ధాన్ని చేశారు. ప్రతిరోజు తెల్లబడజను నాలుగు గంటలకే నిధులు లేచేవారు. లింకెడ్ ఇన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారు. ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు కంపెనీల వెబ్సైట్లను పరిశీలించి.. దరఖాస్తులు పంపించేవారు. అలా ఆమె చూపించిన పట్టుదల వల్ల యాపిల్ కంపెనీలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఆమెకు వార్షిక వేతనం కోటి రూపాయలు. ఇప్పటికీ ఆమె ఇబ్బంది పడుతూనే ఉన్నారు..

” ఇక్కడ హాయిగా ఉందని అనుకోవద్దు. మనుగడ కోసం ప్రతిరోజు పోరాటం చేయాల్సి వస్తోంది. రేపు ఏమవుతుందో అర్థం కావడం లేదు. ఈరోజు ఏం జరుగుతుందో తెలియడం లేదు. కలల స్వర్గం.. ఆశల దీపం.. డాలర్ల ప్రవాహం.. విలాసవంతమైన జీవితం.. అనే మాటలను కాసేపు పక్కన పెట్టాలి. ఎందుకంటే వాస్తవాన్ని అంగీకరించాలంటే గుండె ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఎంత గుండె ధైర్యాన్ని ప్రోది చేసుకున్నప్పటికీ అంత సానుకూల దృక్పథం కనిపించడం లేదని” తన్వి చెబుతున్నారు.. దీనిని బట్టి అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు..

అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారాలు.. యుద్ధాలు.. అమెరికాలో పెరిగిపోయిన నిరుద్యోగం.. ఆర్థిక పరిస్థితి.. ఇతర విధాలైన సమస్యలు అన్నీ కూడా శ్వేత దేశంలో ఉన్నవారిని తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. దీనికి తోడు అక్కడ వర్ణ వివక్ష కొనసాగుతూనే ఉంది. పైకి అమెరికా ప్రభుత్వం గొప్పగా చెబుతున్నప్పటికీ అక్కడ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇకపై బాగుపడుతుందని నమ్మకం కూడా లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version