Homeఅంతర్జాతీయంKerala Nurse Yemen: కేరళ నర్సుకు మరణ శిక్ష.. రంగంలోకి దిగిన భారత ప్రభుత్వం.. అలా...

Kerala Nurse Yemen: కేరళ నర్సుకు మరణ శిక్ష.. రంగంలోకి దిగిన భారత ప్రభుత్వం.. అలా చేస్తే శిక్ష తప్పే అవకాశం!

Kerala Nurse Yemen: గల్ఫ్‌ దేశాలకు ఏటా భారత్‌ నుంచి వందల మంది ఉపాధి కోసం వెళ్తున్నారు. ఎక్కువ మంది కార్మికులుగా పనిచేయడానికే వెళ్లారు. ఐటీ నిపుణులు, ఉన్నత విద్యావంతులు ఎక్కువగా అమెరికాకు వెళ్తారు. ఇక కేరళలో నర్సింగ్‌ పూర్తిచేసినవారు ఎక్కువగా విదేశాలకు వెళ్తుటారు. కేరలకు చెందిన నిమిష ప్రియ కూడా ఇలాగే యెమెన్‌ వెళ్లింది. అయితే అక్కడ ఆమె చేసిన పని కారణంగా యెమెన్‌ ప్రభుత్వం మరణ శిక్ష విధించింది. ఈ విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. నిమిషప్రియను కాపాడేందకు చర్యలు చేపట్టింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ తెలిపారు. భారత ప్రభుత్వం కూడా అవసరమైన సాయం చేస్తోందని వెల్లడించారు.

కేసు ఏమిటంటే…
నిమిష ప్రియ నర్సు కోర్సు పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్‌ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకు వచ్చి ధామస్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె యెమెన్‌లో ఓ క్లినిక్‌ తెరవాలనుకుంది. కానీ, దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంలోనే అది సాధ్యమవుతుంది. దీంతో అక్కడి తలాల్‌ ఆదిట్‌ మెహదీ అనే వ్యిక్తిని నిమిష–థామస్‌ జంట వ్యాపారా భాగస్వామిగా చేసుకున్నారు. అల్‌అమన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. తర్వాత తమ కుమార్తెకు సంప్రదాయ వేడుక కోసం భారత్‌కు వచ్చిన ప్రియ అది ముగియగానే తిరిగి వెల్లింది. ఆమె భర్త, కుమార్తె మాత్రం కేరళలో ఉండిపోయారు. మెహది దీనిని అదనుగా భావించి ఆమె డబ్బులు లాక్కోవడంతోపాటు వేధించాడు. ప్రియాను తన భార్యగా మెహదీ చెప్పుకోవడం మొదటు పెట్టాడు. పాస్‌పోర్టు, ఇతర పత్రాలు లాక్కున్నాడు. ఆమెను కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వలేదు. దీంతో 2016లో ప్రియ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ, వారు పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదీకి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని భావించింది. అయితే డోస్‌ఎక్కువ కావడంతో అతడు చనిపోయాడు. దీంతో మృతదేహాన్ని వాటర్‌ ట్యాంక్‌లో పడేసింది. చివరికి అక్కడి నుంచి సౌదీకి వెళ్తుండగా సరిహద్దుల్లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

ఉరిశిక్ష విధించిన కోర్టు..
ఇదిలా ఉంటే.. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో కోర్టు నిమిష ప్రియకు మరణ శిక్ష విధించింది యెమెన్‌ అధ్యక్షుడు రషద్‌ అల్‌ అలిమి ఇటీవలే మరణ శిక్షను ధ్రువీకరించారు. నెల రోజుల్లో దీనిని అములు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఉరిశిక్ష రద్దు చేసేందకు ఆమె తల్లి ప్రేమకుమారి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ఈ ఏడాది మొదట్లో యెమెన్‌ వెల్లిన నిమిష తల్లి అప్పటి నుంచి శిక్ష తప్పించేందకు ప్రయత్నించారు. కానీ అధ్యక్షుడు ధ్రువీకరించడంతో శ్రమ వృథా అయింది. ఇప్పుడు మృతుడి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితేనే నిమిష ప్రియ మరణ శిక్ష నుంచి బయట పడుతుంది.

పరిహారం చెల్లిస్తే..
ఇదిలా ఉంటే.. మృతుడి కుటుంబానికి కొంత పరిహారం చెల్లిస్తే నిందితులు క్షమించి వదిలేసే అవయారం ఉంది. దీంతో ప్రియ కుటుంబం 40 వేల డాలర్లను(రూ.34.20 లక్షలు) మెహది కుటుంబానికి ఇచ్చేందుకు సమీకరించింది. బాధితుడి కుటుంబంతో చర్చలు జరిపేందుకు భారత దౌత్య కార్యాలయం ఏర్పాట్లు చేసింది. అయితే న్యాయవాది 20 వేల డాలర్లు డిమాండ్‌చేశాడు. దీంతో చర్చలు ఆగిపోయాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version