Jahnavi Kandula Case: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి కందుల జనవరిలో అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె మృతికి ఓ పోలీస్ అధికారి కారణం. అయితే అక్కడి ప్రభుత్వం అతడిపై నేరాభియోగాలు మోపడం లేదని తెలిపింది. సాక్ష్యాధారాలు లేకపోవడంతో అతడిపై నేరాభియోగాలు మోపడం లేదని కింగ్ కౌంటి ప్రాసిక్యూటింగ్ కార్యాలయం ప్రకటించింది. ఈ ఘటనపై సీనియర్ అటార్నీలతో విచారణ జరిపిన అనంతరం ఈ నిర‍్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది.
ఆ అధికారి అక్కడ లేడని..
జాహ్నవి మృతిని తక్కువ చేస్తూ చులకనగా మాట్లాడిన మరో పోలీస్ అధికారి డేనియల్ అడెరెర్ ప్రమాద సమయంలో ఘటన స్థలంఓ లేడని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ తెలిపారు. అడెరెర్‌పై తీసుకోబోయే క్రమశిక్షణ చర్యల ప్రభావం డవేపై అభియోగాలు మోపొద్దనే నిర్ణయం ఉండవోదని వివరించారు. అయితే, అడెరెర్ వ్యాఖ్యలు ఏ మాత్రం ఆమోదయోగ్యమైనవి కాదని పేర్కొంది. పోలీసులపై విశ్వాసం తగ్గించేలా ఉన్నాయని తెలిపింది. కాగా, ఇప్పటికే అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. అతనిపై చర్యల తుది విచారణ అంశం మార్చి 4న కోర్టు ముందుకు రానుంది.
పెట్రోలింగ్ వాహనం ఢీకొని..
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల జాహ్నవి జనవరిలో సియటెల్‌లో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతిచెందింది. ఈకేసు దర్యాప్తుపై పోలీస్ అధికారి డేనియల్ అడెరెర్ చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విని వీడియో ఒకటి వైరల్ అయింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి.. ఈ మరణానికి విలువలేదు’ అన్నట్లుగా సదరు పోలీస్ అధికారి మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. ఆ అధికారిపై చర్య తీసుకోవాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది. దీంతో అమెరికా ప్రభుత్వం అతడిని సస్పెండ్ చేసింది. సదరు అధికారిపై తుది చర్యలకు సంబంధించిన అంశం కోరు‍్ట పరిధిలో ఉంది.
స్పందించిన కేటీఆర్..
అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీసులపై కోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవిని పోలీస్ వాహనం ఢీకొట్టినా సరైన ఆధారాలు లేవని కోర్టు వ్యాఖ్యానించింది అని ట్విటర్‌లో పోస్టు చేశారు. దీనిపై భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకుని అమెరికా ప్రభుత్వవర్గాలతో మాట్లాడాలని పేర్కొన్నారు. జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి అని తెలిపారు. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ స్పందించి నిస్పక్షపాతంగా విచారణ జరిపేలా ఒత్తిడి తీసుకురావాలి. అని పేర్కొన్నారు.