Sanjana Thakur: భారతీయ రచయిత్రికి కామన్వెల్త్‌ బహుమతి!

కామన్వెల్త్‌ బముమతి కింద సంజనా ఠాకుర్‌కు 5 వేల పౌండ్ల నగదు ప్రదానం చేస్తారు. సంచన బహుమతి గెలుచుకున్న కథానిక పేరు ఐశ్వర్య రాయ్‌ కావడం మరో విశేషం. ముంబైలోని ఇరుకైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న అవని అనే యువతి కథ అది.

Written By: Raj Shekar, Updated On : June 28, 2024 12:17 pm

Sanjana Thakur

Follow us on

Sanjana Thakur: కామన్వెల్త్‌ కథానికల పోటీలో ముంబైకి చెందిన 26 ఏళ్ల సంజనా ఠాకుర్‌ ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఈ బహుమతి కోసం ప్రపంచ వ్యాప్తంగా 6,359 మందిలో సంజన ప్రథమురాలిగా నిలిచారు. ఈమేరకు లండన్‌లో గురువారం(జూన్‌ 27న) అధికారికంగా ప్రకటించారు.

5 వేల పౌండ్ల నగదు..
కామన్వెల్త్‌ బముమతి కింద సంజనా ఠాకుర్‌కు 5 వేల పౌండ్ల నగదు ప్రదానం చేస్తారు. సంచన బహుమతి గెలుచుకున్న కథానిక పేరు ఐశ్వర్య రాయ్‌ కావడం మరో విశేషం. ముంబైలోని ఇరుకైన అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న అవని అనే యువతి కథ అది. ఫలానావారు తనకు తల్లి అయి ఉంటే ఎలా ఉంటుంది అని అవని ఆలోచిస్తుంది. ఒక తల్లి పరిశుభ్రతకు అతిగా ప్రాధాన్యమిస్తే, మరో తల్లి.. బాలీవుడ్‌ నటి ఐశ్వర్యారాయ్‌లా అందాల రాశి. ఆధునిక నగర జీవితంలో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్న తీరుకు ఈ కథ అద్దం పడుతుంది.

స్పందించిన సంజనా..
తన కథానికకు కామన్వెల్త్‌ ఫస్ట్‌ ప్రైజ్‌ రావడంపై సంజనా ఠాకుర్‌ స్పందించారు. ‘ అపురూపమైన బహుమతిని అందుకున్నందుకు నేను ఎంత గౌరవంగా ఉన్నానో చెప్పలేను. ప్రజలు చదవాలనుకునే కథలు రాయడం కొనసాగిస్తానని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. ‘ నా వింత కథ కోసం తల్లులు, కుమార్తెల గురించి శరీరాలు, అందం 6పమాణాలు, బాంబే స్ట్రీట్‌ ఫుడ్‌ గురించి అటువంటి ప్రపంచ ప్రేక్షకులను కనుగొనడం థ్రిల్లింగ్‌గా ఉంది. ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు’ అని సంజనా పేర్కొన్నారు.

మరో నలుగురికి ప్రాంతీయ అవార్డులు..
కామన్వెల్త్‌ కథానికల పోటీలో మరో నలుగురికి ప్రాంతీయ విజేతలుగా ప్రకటించారు. ఇందులో కెనడా నుంచి జూలీ బౌచర్డ్‌ , న్యూజిలాండ్‌ నుంచి పిప్‌ రాబర్ట్‌ సన్, మారిషస్‌ నుంచి రీనా ఉషా రూంగూ, ట్రినిడాడ్, టొబాగో నుంచి పోర్జియా సుబ్రాన్‌ను ఎంపిక చేశారు.