Indian student murdered in Australia
Indian student : విదేశాల్లో భారతీయ విద్యార్థుల హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. మొన్నటి వరకు అగ్రరాజ్యం అమెరికాలో భారతీయ విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోగా, తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో భారత విద్యార్థి హత్యకు గురయ్యాడు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన 22 ఏళ్ల నవజీత్ సంధుని కత్తితో విచక్షణ రహితంగా పొడిచి చంపేశారు దుండగులు. ఈ ఘటనపై మెల్‌బోర్న్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఏడాది క్రితం స్టడీ వీసాపై..
హర్యానా రాష్ట్రం కర్నాల్‌లోని గగ్సినా గ్రామానికి చెందిన నవజీత్ ఎంటెక్ చదివేందుకు స్టడీ వీసాపై ఏడాది క్రితం ఆస్ట్రేలియా వెళ్లాడు. కర్నాల్, బస్తాడా గ్రామానికి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా మూడు నెలల క్రితం ఉన్నత చదువుకోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. నవజీత్ తన స్నేహితుడు శ్రవణ్, మరో ఇద్దరితో కలిసి ఒకే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల శ్రవణ్ వేరే ప్రాంతానికి మారాలని నిర్ణయించు కున్నాడు. ఈ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. నవజీత్ కారులో సామాన్లు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా స్నేహితులు శ్రవణ్‌తో గొడవకు దిగారు. వారిని వారించేందుకు నవజీత్ యత్నిండు. దీంతో ఆగ్రహించిన స్నేహితుల అతడిని కత్తితో విచక్షణారహితంగా పొడిచారు. ఛాతీపై తీవ్రమైన కత్తిపోటు గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శ్రవణ్ కూడా గాయపడ్డాడు.
గొడవ వద్దన్నందుకే..
గొడవ పడొద్దని వారించినందుకు నవజీతపై దాడిచేసి చంపేశారని బాధితుడి మేనమామ, ఆర్మీ అధికారి యశ్వీర్ తెలిపారు. నవజీత్ తెలివైన విద్యార్థి అని తెలిపారు. సెలవులపై జూలైలో ఇండియాకు రావాల్సి ఉందని పేర్కొన్నారు. జీనత్ ఉన్నత చదువు కోసం ఆయన తండ్రి ఎకరంనర భూమిని విక్రయించాడని వెల్లడించారు.