https://oktelugu.com/

NRIs: ఎన్నారైలకు షాకింగ్ న్యూస్… ట్యాక్స్‌ క్లియరెన్స్‌ ఉంటేనే విదేశాలకు అనుమతి.. లేదంటే ఇండియాలోనే!

ఉద్యోగం, ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన అనేక మంది అక్కడే స్థిరపడ్డారు. కొందరు అక్కడి నుంచి తమ సంపాదనను భారత్‌కు పంపిస్తారు. స్థానికంగా ఉన్న కుటుంబ సభ్యులు వాటితో ఇక్కడి అప్పులు తీర్చడం, అభివృద్ధికి ఖర్చు చేస్తారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 2, 2024 / 10:40 AM IST

    NRIs

    Follow us on

    NRIs: భారతీయులు ఏటా వార్షిక ఆదాయంపై కేంద్రం ఆదాయపు పన్ను వసూలు చేస్తుంది. తాజా బట్జెట్‌ ప్రకారం.. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్నవారికి ఎలాంటి ట్యాక్స్‌ లేదు. రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు 5 శాతం టాక్స్‌ చెల్లించాలి. రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారు 10 శాతం ఐటీ చెల్లించాలి. ఇక రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు 15 శాతం ఐటీ చెల్లించాలి. రూ.15 లక్షలకుపైగా ఆదాయం ఉన్నవారు 30 శాతం ఐటీ చెల్లించాలి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 230 ప్రకారం కేంద్రం ఈ పన్ను వసూలు చేస్తుంది. ఇదిలా ఉంటే.. భారత దేశంలో ఉండి దేశం విడిచి వెళ్లాలనుకునేవారు కూడా ఇకపై ఐటీ క్లియరెన్స్‌ చేయాలని కేంద్రం నిబంధన విధించింది. ఆదాయపు పన్ను పరిధిలో ఉన్న చాలా మంది దానిని చెల్లించకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరిస్తున్నారు. దీంతో కేంద్రానికి ఆదాయం తగ్గుతుంది. ఏటా వార్షిక ఆదాయం పెరుగుతున్నవారు కూడా ట్యాక్స్‌ నుంచి తప్పించుకోవాలనే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా నిబంధనలు కఠినం చేస్తోంది. మరోవైపు ఆదాయ పరిమితిని కూడా ఏటా పెంచుతోంది. అయినా ట్యాక్స్‌ పరిధిలోకి రాకుండా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం మరో నిబంధన కఠినతరం చేసింది. భారత్‌ను వీడాలనుకునేవారు ఇకపై ఆదాయపను శాఖ నుంచి ట్యాక్స్‌ క్లియరెన్స్‌ పర్టిఫికెట్‌ పొందాలి. ఈ సర్టిఫికేట్‌ మీరు చెల్లించాల్సిన పన్నులు లేవని లేదా ఏదైనా బాకీ ఉన్న మొత్తాలను సెటిల్‌ చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు రుజువు చేస్తుంది. ఈ నియమం ఆదాయపు పన్ను చట్టం కింద పన్నులు, అలాగే సంపద పన్ను, బహుమతి పన్ను, వ్యయ పన్ను వంటి గత పన్నులను వర్తిస్తుంది. కొత్త మార్గదర్శకాలు ఈ అవసరాలను స్పష్టం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

    తాజా బడ్జెట్‌లో ప్రతిపాదన..
    2024 బడ్జెట్‌లో విదేశీ ఆస్తులు (రియల్‌ ఎస్టేట్‌ మినహా) వాటి మొత్తం విలువ రూ.20 లక్షల కంటే తక్కువ ఉంటే, 2024, అక్టోబర్‌ 1 నుంచి రిపోర్ట్‌ చేయనందుకు రూ.10 లక్షల జరిమానా విధించాలని ప్రతిపాదించింది. ఈ ఆస్తులను నివేదించడంలో తప్పులు లేదా వైఫల్యాలకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. నివాసితులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేటప్పుడు అన్ని విదేశీ ఆస్తులు, ఈ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయాన్ని తప్పనిసరిగా నివేదించాలి. అలా చేయడంలో విఫలమైతే, ఆస్తి విలువతో సంబంధం లేకుండా బ్లాక్‌ మనీ చట్టం కింద రూ.10 లక్షల జరిమానా విధించబడుతుంది. అయితే, గత సంవత్సరంలో మొత్తం రూ.5 లక్షలు లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్‌ ఉన్న బ్యాంక్‌ ఖాతాలకు ఈ నియమం వర్తించదు. శాశ్వతంగా భారతదేశం నుంచి వెళ్లేవారికి మాత్రం తప్పనిసరి. ఎన్నారైలు, పునరావాసం పొందుతున్న వారు ఈ నియమాన్ని గుర్తుంచుకోవాలి.

    అందరికీ వర్తించదు..
    ఇదిలా ఉంటే.. ఈ నియమం శాశ్వతంగా విదేశాలకు వెళ్లేవారిని మాత్రమే వర్తిస్తుంది. విదేశాలకు వెళ్లే అందరికీ ఇది వర్తించదు. ప్రయాణానికి ముందు ప్రతి భారతీయుడికి ఈ క్లియరెన్స్‌ అవసరమైతే పన్ను కార్యాలయాలు రద్దీగా మారుతాయి. విమానాశ్రయాలు నిశ్శబ్దంగా మారవచ్చు. అందుకే కేంద్రం కేవలం దేశాన్ని వీడాలనుకునే వారికే ఈ నిబంధన వర్తించేలా చర్యలు తీసుకుంది. ట్యాక్స్‌ క్లియరెన్స్‌ లేకుండా విదేశాలకు వెళ్లేవారిని అనుమతించరు.