H 1B Visa Scam: అమెరికాలో హెచ్‌–1బీ వీసా స్కామ్‌.. సూత్రధాని తెలంగాణ అధికారపార్టీ నేత.. బ్లూమ్‌బర్గ్‌ నివేదికలో పెను సంచలనాలు!

విదేశాలకు.. ముఖ్యంగా అమెరికా వెళ్లాలి.. డాలర్‌ డ్రీమ్‌ నెరవేర్చుకోవాలనుకునే యువత ఆకాంక్షను కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. స్కిల్స్‌ లేకపోయినా ఉన్నట్లు తప్పుడు పత్రాలు చూపించి విదేశాలకు పంపిస్తున్నారు. అక్కడకు వెళ్లాక యువత ఇబ్బంది పడుతోంది.

Written By: Raj Shekar, Updated On : August 2, 2024 10:47 am

H 1B Visa Scam

Follow us on

H 1B Visa Scam: ఐదేళ్లుగా అగ్రరాజ్యం అమెరికా వెళ్లున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ఎలాగైనా అమెరికా వెళ్లాలని, తమ పిల్లలను అమెరికా పంపించాలి అనుకునే తల్లిదండ్రుల కలను దేశంలోని కొన్ని కన్సల్టెన్సీ సంస్థలు నెరవేరుస్తున్నాయి. అయితే కొన్ని సంస్థలు మోసం చేస్తున్నాయి. తప్పుడు పత్రాలు సృష్టించి విదేశాలకు పంపుతున్నాయి. ఇలాంటి మోసాలు ఎక్కువగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారు ఎదుర్కొంటారు. విజిట్‌ వీసాలపై అక్కడకు వెళ్లాక ఇబ్బంది పడతారు. ఇక్కడ ఒక ఉద్యోగం అని చెప్పి.. అక్కడకు వెళ్లాక మరో ఉద్యోగం చూపించడం వంటి మోసాలు కూడా జరుగుతున్నాయి. పేదరికం నుంచి యబటపడేందుకు వెళ్లేవారు అప్పుడ చేసి మరీ కన్సల్టెన్సీలకు డబ్బులు చెల్లిస్తున్నారు. కానీ, చివరకు మోసపోతున్నారు. తాజాగా ఇలాంటి మోసమే అగ్రరాజ్యం అమెరికాలో వెలుగు చూసింది. దీనివెనుక తెలంగాణ అధికార పార్టీకి చెందిన నేత ఉన్నట్లు నిర్ధారించారు. గతేడాది నుంచి బైడెన్‌ ప్రభుత్వం కూడా ఇలాంటి మోసాలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో చాలా వరక భారతీయ కన్సల్టెన్సీలు మూతపడ్డాయి. దీంతో చాలా మంది అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చేశారు. ఇక తాజాగా తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు యూఎస్‌లో భారీ హెచ్‌–1బీ వీసా స్కాంకు పాల్పడ్డాడు. ఇండో అమెరికన్‌ వ్యాపారి అయిన అతను వీసా లొసుగులను ఆధారంగా చేసుకుని హెచ్‌–1బీ వీసాల లాటరీ వ్యవస్థనే తారుమారు చేసినట్లు తెలిసింది.

అధికార పార్టీ నేత..
అమెరికాలో స్థిరపడిన ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన కంది శ్రీనివాస్‌రెడ్డి హెచ్‌–1బీ వీసా స్కాంకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈమేరకు అక్కడి బ్లూమ్‌మర్గ్‌ సంస్థ నిర్ధారించింది. అమెరికా వీసా నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. అమెరికా వెళ్లాలనుకునే చాలా మందికి వీసాలు రావడం లేదు. దీనిని గుర్తించిన కంది శ్రీనివాస్‌రెడ్డి భారతీయును ఈజీగా వీసా సంపాదించి పెడుతున్నాడు. వీసా కోసం పోటీ పడే టెకీలు, స్టార్టప్, బ్యాంక్స్, డ్రగ్స్‌ మేకర్స్‌ పోటీ పడుతున్నారు. దీంతో ఈ పోటీ మధ్య హెచ్‌–1బీ వీసాలు సులభంగా అందేలా చేస్తున్నాడు కంది శ్రీనివాస్‌రెడ్డి.

లాటరీ సిస్టంలో స్కామ్‌..
అయితే అమెరికా ప్రభుత్వం గతేడాది 85 వేల హెచ్‌–1బీ వీసాలు జారీ చేసింది. దీనికి 4 లక్షలకుపైగా మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ వీసాల జారీలో పెద్ద కంపెనీల ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తుంది. దీంతో నైపుణ్యం లేనివారికి వీసా దొరకడం లేదు. ఈ నేపథ్యంలో లాటరీ సిస్టంలోనే స్కామ్‌కు తెరలేపాడు. ఒకే అభ్యర్థి పేరుతో పది నుంచి 15 దరఖాస్తులు చేయించి వాటి నంచి వీసా పొందేలా చేశాడు. దీనిపై అనుమానాలు రావడంతో అక్కడి అధికారులు కూపీ లాగారు. దీంతో స్కామ్‌ బయటపడింది. మొత్తం 85 వేల వీసాలలో 11 వేలు మల్టీ నేషనల్‌ కంపెనీలు దక్కించుకున్నాయి. మరో 22,600 మంది ఐటీ కంపెనీలకు వెళ్లారు.

తప్పుడు మార్గంలో 15,500 వీసాలు..
ఇక బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం.. ఎక్కువ సంఖ్యలు దరఖాస్తులు చేయడం ద్వారా సుమారు 15,500 హెచ్‌–1బీ వీసాలను తప్పుడు మార్గంలో సంపాదించుకున్నట్లు గుర్తించారు. ప్రతీ ఆరు వీసాల్లో ఒకటి లాటరీని మేనేజ్‌ చేసి పొందినట్లు బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. నాలుగేళ్లలో ఒక స్టాంపింగ్‌ సంస్థ ఆపరేటర్‌ 10 నుంచి 12 కంపెనీల తరఫున 15కుపైగా దరఖాస్తు చేశాడు. లాటరీ ద్వారా వీసా వచ్చేలా చేసినట్లు నిర్ధారించారు. ఇక తెలంగాణకు చెందిన కంది శ్రీనివాస్‌రెడ్డి ఇండో అమెరికన్‌ ఫార్మర్స్‌ కోఆపరేటివ్‌ సంస్థకు వ్యవస్థాపకుడు. ఆయన కూడా మల్టీ రిజిస్ట్రేషన్‌ చేయిస్తూ పలు కంపెల ద్వారా వందల వీసాలు ఇప్పించినట్లు బ్లూమ్‌బర్గ్‌ నిర్ధారించింది. 2020 నుంచి 2024 వరకు 300లకుపైగా హెచ్‌–1బీ వీసాలు ఇలా ఇప్పించారని తెలిపింది. 13 కంపెనీలు నిర్వహిస్తూ.. ఆ కంపెనీల ద్వారా వీసా లొసుగులను ఆసరాగా చేసుకుని ఈ స్కాం చేసినట్లు నిర్ధారించింది. 2023లోనే 54 మంది వీసాలు సాధించారు. ఇదిలా ఉంటే. కంది శ్రీనివాస్‌రెడ్డి వ్యాపారంతోపాటు భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయాలలో పాల్గొంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ నుంచి పోటీ చేశారు.