https://oktelugu.com/

Tamil Industry: తమిళ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం తో షాక్ లో ఉన్న స్టార్ హీరోలు..

సినిమా ఇండస్ట్రీ ఎంత మంది టెక్నీషియన్స్ ఉన్నప్పటికీ, ఇక్కడ హీరోల డామినేషన్ ఎక్కువ గా ఉంటుంది. ఒక హీరో డేట్స్ ఇచ్చాడు అంటే ప్రొడ్యూసర్స్ ఈజీ గా ఆ సినిమాను చేస్తారు.

Written By:
  • Gopi
  • , Updated On : August 2, 2024 / 10:52 AM IST

    Tamil Industry

    Follow us on

    Tamil Industry: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటులు చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళ సినిమాలను తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో తెలుగు ప్రేక్షకులు తమిళ్ హీరోలను కూడా ఆదరిస్తున్నారు. ఇక ఆ క్రమంలోనే కమల్ హాసన్, రజినీకాంత్ లను మొదలుకొని నిన్న మొన్న వచ్చిన చిన్న హీరోల వరకు తమిళ్ హీరోలందరూ తెలుగులో మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటూ వాళ్ల సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ‘తమిళ సినిమా నిర్మాతల మండలి’ ఒక మీటింగ్ ని అరెంజ్ చేసింది. ఇక అందులో కొన్ని కీలకమైన నిర్ణయాలను కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కి నష్టాలు రాకుండా ఉండే విధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన ఎక్కువ సేపు చర్చ నడిచింది. ఇక అందులో నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే ఎవరైతే హీరో ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి అడ్వాన్సులు తీసుకొని సినిమాను తొందరగా ఫినిష్ చేయడం లేదో వాళ్ల మీద కొరడాని ఝులిపించారు. ఇక మీదట నుంచి ప్రతి హీరో ఒక సినిమా అయిపోయిన తర్వాతే మరొక సినిమాకి కమిట్ అవ్వాలని తెలియజేశారు. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ సినిమా కోసం తన ఆస్తి మొత్తాన్ని అమ్ముకోని మరి డబ్బులు పెడుతున్నాడని, అందువల్ల సినిమా ఒక్కరోజు లేటైనా ప్రొడ్యూసర్స్ కి కొన్ని లక్షల్లో నష్టం వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక హీరోలు ముందు ఒక సినిమాని కంప్లీట్ చేసిన తర్వాతే మరొక సినిమాకి అడ్వాన్స్ తీసుకోవాలంటూ ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.

    ఇక దీని ద్వారా చాలామంది తమిళ్ హీరోలకు భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ కి మాత్రం ఇది కొంచెం లాభదాయకమైన విషయమనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియర్స్ దగ్గర చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ కి ఫైనాన్స్ తీసుకువచ్చి డబ్బులు పెడతారు. ఇక హీరోలు వాళ్ల ఇష్టం వచ్చినప్పుడు డేట్లు ఇచ్చి సినిమా షూటింగ్ చేస్తే ప్రొడ్యూసర్స్ తీసుకొచ్చిన ఫైనాన్స్ డబ్బులు అంతకంతకు పెరిగి వాళ్లకు ఎంత లాభాలు వచ్చినా కూడా ఫైనాన్షియర్లకే చాలా ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఫైనల్ గా ప్రొడ్యూసర్స్ కి ఏమి మిగలడం లేదు.

    ఇక దీనివల్ల హీరో ఆ సినిమా పూర్తయ్యేంత వరకు ఆ సినిమా మీదే డేట్స్ కేటాయించి ఫోకస్డ్ గా ఉంటాడు. కాబట్టి సినిమాని తొందరగా ఫినిష్ చేయొచ్చు అనే ఉద్దేశ్యం తోనే నిర్మాతల మండలి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో పాటు ఆగస్టు 15 నుంచి కొత్త సినిమాల షూటింగ్ లు జరపవద్దని ఇప్పటి వరకు కమిట్ అయిన అన్ని సినిమాలను పూర్తి చేసిన తర్వాతే ఆ హీరోలు కొత్త సినిమాలకు అడ్వాన్సులు తీసుకోవాలని ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇక దీంతో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన న్యూస్ లు వస్తున్నాయి.

    ఇక దానికి తగ్గట్టుగానే కొంతమంది ‘ప్రొడ్యూసర్స్ రాక్స్ హీరోలు షాక్స్’ అంటూ కొన్ని మీమ్స్ ని కూడా తయారు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు… నిజానికి ప్రొడ్యూసర్స్ ఇచ్చిన దెబ్బ నుంచి హీరోలు కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది…చూడాలి మరి దీని మీద తమిళ్ హీరోలు ఎలా స్పందిస్తారు అనేది…