https://oktelugu.com/

US Student Visa: అమెరికా వెళ్లే విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. స్టూడెంట్‌ వీసా ఇంటర్వ్యూ తేదీలు ఇవే!

దశల వారీగా స్లాట్లను అందుబాటులోకి తీసుకొస్తామని అమెరికా రాయబార కార్యాలయం అధికారి తెలిపారు. జూన్‌ నెల స్లాట్లను ఈనెల మూఓ వారంలో, జూలై నెల జూన్‌లో ఆగస్టు నెలకు ఇంటర్వ్యూ తేదీలను విడుదల చేయనున్నట్లు వివరించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 8, 2024 / 09:53 AM IST

    US Student Visa

    Follow us on

    US Student Visa: అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్య చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఆ దేశం శుభవార్త చెప్పింది. ఈనెల 31 వరకూ విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్‌లను మంగళవారం(మే 7న) విడుదల చేసింది. ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్‌కతా కాన్సులేట్‌ కార్యాలయాల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

    దశల వారీగా స్లాట్లు..
    దశల వారీగా స్లాట్లను అందుబాటులోకి తీసుకొస్తామని అమెరికా రాయబార కార్యాలయం అధికారి తెలిపారు. జూన్‌ నెల స్లాట్లను ఈనెల మూఓ వారంలో, జూలై నెల జూన్‌లో ఆగస్టు నెలకు ఇంటర్వ్యూ తేదీలను విడుదల చేయనున్నట్లు వివరించారు. అమెరికాలో రెండు సెమిస్టర్ల విద్యా సంవత్సరానికి సబంధించి ఫాలల్‌ సీజన్‌ ఏటా ఆగస్టు–సెప్టెంబర్‌లో ప్రారంభం అవుతుంది. ఈ సీజన్‌లో అక్కడి యూనివర్సిటీల్లో అడ్మిషన్ల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో సమాయత్తం అవుతున్నారు.

    ఆదివారాల్లోనూ..
    వీసా ప్రక్రియలో భాగంగా తొలిముద్రల నమోదు, తర్వాత ప్రత్యక్ష ఇంటర్వ్యూ విధానాన్ని అమెరికా అమలు చేస్తుంది. అమెరికా రాయబార కార్యాలయంతోపాటు అన్ని కానుసలేటు కార్యాలయాలకు శని ఆదివారాలు సెలవులు. అయితే రద్దీ దృష్ట్యా ప్రస్తుతానికి వేలిముద్రల నమోదుకు శని, ఆదివారాలైన మే 19, 29 తేదీల్లోనూ స్లాట్లు కేటాయించారు.

    అక్టోబర్‌లో టూరుస్టు వీసాలు..
    విద్యార్థుల వీసాల ప్రక్రియ పూర్తయ్యాక.. టూరిస్టు వీసా(బీ1, బీ2) స్లాట్లు అదుబాటులోకి వస్తాయని సమాచారం. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్‌ రెండో వారంలోగా విద్యార్థి వీసాల ప్రక్రియ పూర్తి అవుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్‌ చివరి వారం లేదా అక్టోబర్‌లో పర్యాటక వీసా స్లాట్లు జారీ అవుతాయని సమాచారం. నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. అంతకు ముందే పర్యాటక వీసాల ప్రక్రియ పూర్తి చేయాలని అగ్రరాజ్యం భావిస్తోంది.