Homeబిజినెస్Petrol: అక్కడ రూ.200 కంటే ఎక్కువ పెట్రోల్ పోయరు..

Petrol: అక్కడ రూ.200 కంటే ఎక్కువ పెట్రోల్ పోయరు..

Petrol: పెట్రోల్, డీజిల్ లేకుండా ఏ వాహనం ముందుకు సాగదు. నిత్యం లక్షల కొద్దీ వాహనాలు రోడ్లపై ప్రయాణిస్తుంటాయి. వీటిలో పెట్రోల్ ఇంధనంతో నడిచేవే ఎక్కువగా ఉంటాయి. వాహనాల రాకపోకలపై పరిమితి లేనందున ప్రతి ఒక్కరూ ఎంత ఇంధనం కావాలంటే అంత ఇస్తారు. పెద్ద పెద్ద వాహనాల్లో అయితే ఎక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి ఒకేసారి కొనుగోలు చేస్తారు. కానీ ఓ రాష్ట్రంలో మాత్రం పెట్రోల్ కొనుగోలు చేయడానికి పరిమితులు ఉన్నాయి. పెట్రోల్ ను రూ.200 కొనుగోలు మాత్రమే పరిమితి విధించారు. ఎందుకంటే?

భారత్ లో ఈశాన్య రాష్ట్రాలది ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడి లాగా అక్కడి జనజీవనం సారవంతమైన నేలలో కాకుండా కొండ చరియల్లో ఉంటుంది. దీంతో ఈ కొండ చరియలు విరిగిపోవడం వల్ల నిత్యం రాకపోకలు నిలిచిపోతుంటాయి. ఇదే కోవలో తాజాగా త్రిపుర రాష్ట్రంలోని లుమ్ డింగ్ డివిజన్ పరిధిలో జటింగా, లఫూర్ మధ్య ఏప్రిల్ 25న ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆహార వస్తువులు నిలిచిపోయాయి.

నిత్యావసర వస్తువులు సరఫరా నిలిచిపోవడంతో వస్తువుల రవాణాను పరిమితం చేశారు. ఈ క్రమంలో వాహనాల్లో పోసుకునే పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై పరిమితి విధించారు. ఈ నియమాలు మే 2 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నియమాల ప్రకారం టూవీర్స్ కలిగిన వారు ప్రతి రోజు రూ.200 పెట్రోల్ ను మాత్రమే కొనుగోలు చేయాలి. అలాగే డీజిల్ వాహనాలు 4 వీలర్ అయితే రూ.500, మిని బస్సులు 40 లీటర్ల ఇంధనం మాత్రమే కొనుగోలు చేయాలి.

ఇక ప్యాసింజర్ ఆటోలైతే కేవలం 15 లీటర్ల పెట్రోల్ కు మాత్రమే అవకాశం ఇస్తారు. ఇలా పెట్రోల్ కొనుగోలుపై పరిమితి విధించినందున వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వివిధ అవసరాల నిమిత్తం పెట్రోల్ అవసరం ఎక్కువగా ఉంటుందని, ఇలా నింధనలు విధించడం వల్ల అవసరాలు తీరడం లేదని ఆందోళన చెందుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఆలోచించాలని కోరుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Oktelugu Epaper
Exit mobile version