Indian Americans: మీ దేశానికి వెళ్లిపోండి..బూతులు తిడుతూ భారతీయ మహిళపై దాడి..వీడియో వైరల్

Indian Americans: అమెరికాలో జాత్యంహకారం మరోసారి బయటపడింది. రెస్టారెంట్ కు వచ్చిన నలుగురు భారతీయ మహిళలపై అమెరికాలోని టెక్సాస్ లో ఓ మహిళ దాడి చేసి గాయపరచడం కలకలం రేపింది. ఈ వీడియోలో దారుణంగా బూతులు తిట్టింది. మీ దేశానికి వెళ్లిపోండి అంటూ భారతీయ మహిళలపై సదురు మహిళ విరుచుకుపడింది. వీటిని భారతీయ మహిళలు వీడియో తీయడంతో ఆమె దాడి, తిట్లకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో […]

Written By: NARESH, Updated On : August 26, 2022 12:50 pm
Follow us on

Indian Americans: అమెరికాలో జాత్యంహకారం మరోసారి బయటపడింది. రెస్టారెంట్ కు వచ్చిన నలుగురు భారతీయ మహిళలపై అమెరికాలోని టెక్సాస్ లో ఓ మహిళ దాడి చేసి గాయపరచడం కలకలం రేపింది. ఈ వీడియోలో దారుణంగా బూతులు తిట్టింది. మీ దేశానికి వెళ్లిపోండి అంటూ భారతీయ మహిళలపై సదురు మహిళ విరుచుకుపడింది. వీటిని భారతీయ మహిళలు వీడియో తీయడంతో ఆమె దాడి, తిట్లకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మహిళను అరెస్ట్ చేశారు.

నలుగురు భారతీయ మహిళలు టెక్సాస్ లోని డల్లాస్ లోని ఓ రెస్టారెంట్ కు వచ్చారు. బుధవారం రాత్రి ఓ మెక్సికన్ అమెరికన్ మహిళ ప్లానోకు చెంది ఎస్మెరాల్డా అప్ఘన్.. భారతీయ మహిళలతో దారుణంగా ప్రవర్తించింది. భారతీయులను ద్వేషిస్తున్నానని.. భారతీయులు మెరుగైన జీవితం కోసం అమెరికాకు వస్తున్నారంటూ బూతులు తిడుతూ ఊగిపోయింది. మా దేశం వదిలి వెళ్లిపోండి అంటూ పిడిగుద్దులు గుద్దింది. కొందరు వీడియో తీయడంతో ఆ అమెరికన్ మహిళ ఆగడాలు బయటపడ్డాయి.

ఈ వీడియో చూసిన అమెరికాలోని భారతీయులు ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమెను అరెస్ట్ చేసి జైలుకు పంపారు పోలీసులు.

టెక్సాస్ లోని డల్లాస్ లో తన అమ్మ, ఆమె ముగ్గురు స్నేహితులు కలిసి భోజనానికి వెళ్లగా.. ఒక అమెరికన్ లేడీ జాత్యాంహకార దూషణలు చేసిందని ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళలతో కలిసి పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయంలో భారతీయ వాట్సాప్ గ్రూపులలో కూడా వైరల్ చేయడంతో వారంతా ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులు గురువారం మధ్యాహ్నం మహిళ అప్టన్ ను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు పెట్టి జైలుకు పంపారు. ఈ సమయంలో ఆమె దగ్గర తుపాకీ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికాలో మరోసారి భారతీయులపై జాత్యాంహకార దూషణలు, దాడులు జరగడం కలకలం రేపుతోంది.