Tana : అమెరికాలోని తెలుగువారిని ఏకం చేసేందుకు, తెలుగు సంస్కృతి,సంప్రదాయాలను కాపాడుతూ.. భావితరాలకు సంస్కృతి సంప్రదాయాలను అందించడంతోపాటు అమెరికాకు వెళ్లే తెలుగు వారికి సహాయ సహకారాలు అందిస్తోంది తానా. 1973 ఏర్పడిన తానా.. విభిన్న కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. తెలుగుదనం ఉట్టిపడేలా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలుగువానిని ఐక్యం చేసేలా పండుగలు, ఉత్సవాలు, సాంస్కృతిక పోటీలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా తానా కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఉమా కటికి(ఆర్మండండ్ల) ఆధ్వర్యంలో తొలిసారిగా కల్చరల్ పోటీలు నిర్వహిస్తోంది. ఆగస్టు 8న పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా బోలింగ్‌బ్రోక్ మేయర్ మేరి అలెగ్జాండర్ బాస్టా హాజరై పోటీల్లో పాల్గొంటున్న కళాకారులను అభినందించారు.
రీజియన్ల వారీగా పోటీలు..
ఆగస్టు 8న ప్రారంభించిన పోటీలను నవంబర్ 1వ తేదీ వరకు రీజియన్ల వారీగా నిర్వహించారు. వాయిస్ ఆఫ్ తానా, తానా అల్టిమేట్ ఛాంపియన్స్, తానా డ్యాన్స్ జోడీ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. రీజియన్ల వారీగా విజేతలకు బహుమతులు అందించారు. రీజియన్ పోటీల్లో ప్రతిభ కబర్చినవారిని ఫైనల్స్‌కు ఎంపిక చేశారు.
కరోలినాలో ఫైనల్స్..
రీజినల్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి నార్త్‌కరోలినాలో ఫైల్ పోటీలు నిర్వహిస్తామని తాజా కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్ ఉమా కటికి తెలిపారు. గీతాలాపన(శాస్త్రీయ, జానపద, సినిమా), డ్యాన్స్ పోటీలు 0–9, 10–14, 15–25 ఏళ్ల వారికి వేర్వేరుగా నిర్వహిస్తామని తెలిపారు. 25 ఏళ్లు పైబడిన వారికి డ్యాన్స్ జోడీ కాంపిటీషన్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందుల్లో భార్య, భర్తలు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. పాటల పోటీ విజేతలకు వాయిస్ ఆఫ్ తానా అవార్డు, డ్యాన్స్‌లో తానా అల్టిమేట్ డాన్స్ ఛాంపియన్ అవార్డు, జోడీ డాన్స్‌లో తానా డ్యాన్స్ జోడీ అవార్డు ఇవ్వన్నట్లు వివరించారు
5 వేలకుపైగా బహుమతులు…
ఫైనల్‌లో పోటీలు నవంబర్ HSNC, 309 Aviation Pkwy, Morrisville,, , నార్త్‌రోలినాలో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. విజేతలకు 5 వేలకుపైగా బహుమత్రులు, ట్రోఫీలు, నగదు అందిస్తారు. బహుమతుల ప్రధానోత్సవానికి అతిథులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి.