New Zealand Visa: వీసా నిబంధనల్లో మార్పు.. న్యూజిలాండ్‌ సర్కార్‌ సంచలన నియమం..

వీసా స్పాన్సర్లు న్యూజిలాండ్‌ ఆర్థిక, ఇమ్మిగ్రేషన్‌ ప్రాధాన్యతకు అనుగుణంగా నిర్ధిష్ట ప్రమాణాలు పెంచుకునేలా వీసా ప్రక్రియను సమర్థించడమే ఈ నిబంధనల లక్ష్యం.

Written By: Raj Shekar, Updated On : June 29, 2024 10:04 am

New Zealand Visa

Follow us on

New Zealand Visa: ఆస్ట్రేలియా ఖండ దేశం న్యూజిలాండ్‌ వీసా నిబంధనల్లో మార్పులు చేసింది. తమ దేశలోని కొన్ని ప్రాంతాల్లో పని చేస్తున్న విదేశీయులు తమ ద్వారా తమ వారిని వర్క్‌ విజిటర్, స్టూడెంట్‌ వీసాలకు స్పాన్సర్‌ చేయడానికి అనుమతించని కొత్త ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలను న్యూజిలాండ్‌ ప్రకటించింది.

కొత్త రూల్స్‌ ఇవీ..
వీసా స్పాన్సర్లు న్యూజిలాండ్‌ ఆర్థిక, ఇమ్మిగ్రేషన్‌ ప్రాధాన్యతకు అనుగుణంగా నిర్ధిష్ట ప్రమాణాలు పెంచుకునేలా వీసా ప్రక్రియను సమర్థించడమే ఈ నిబంధనల లక్ష్యం. వీటి ప్రకారం జూన్‌ 26 నుంచి ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్‌ స్టాండర్డ్‌ క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ ఆక్యుపేషన్స్‌ లైవర్స్‌ 4, 5 లో రెసిడెన్సీ పాత్వేస్‌(వివిధ రంగాల్లో నైపుణ్యాలు) లేకుండా అక్రిడిటేషన్‌ ఎంప్లాయర్‌ వర్క్‌ వీసా ఉన్నవారు ఇకపై తమ భాగస్వాములు, పిల్లల కోసం వర్క్, విజిట్, స్టూడెంట్‌ వీసా దరఖాస్తుల ద్వారా తీసుకెళ్లే అవకాశం లేదు.

పలు సవరణలు..
ఈ ఏడాది ప్రారంభంలో ఏఈడబ్ల్యూవీ పథకానికి చేసిన విస్తృత సవరణలకు అనుగుణంగా ఈ సర్దుబాటు ఉంటుంది. అయితే భాగస్వాములు, పిల్లలు సంబంధిత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ఎక్రిడేటర్‌ ఎంప్లాయర్‌ వర్క్‌ వీసా లేదా అంతర్జాతీయ స్టూడెంట్‌ వీసా వంటి వాటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే భాగస్వాములుగా లేదా డిపెండెంట్‌ పిల్లలుగా వీసాలను కలిగి ఉన్నవారిపై ఈ మార్పుతో ప్రభావం ఉండదని న్యూజిలాండ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.