https://oktelugu.com/

Bathukamma celebrations : కెనడా గడ్డపై బతుకమ్మ సంబరం.. ఆటపాటలు.. పిండి వంటలతో సందడి..

బతుకమ్మ తరువాత దసరా వేడులకను కూడా ఘనంగా నిర్వహించుకున్నారు. సంబరాల్లో భాగంగా దుర్గాదేవిని ఘనంగా పూజించి ఆ తరువాత జమ్మిని ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 30, 2023 / 12:05 PM IST
    Follow us on

    Bathukamma celebrations : బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లో తెలుగువారు ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉంటున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు బతుకమ్మను ప్రతీ ఏడాది వైభవంగా నిర్వహిస్తూ సాంప్రదాయాలను కాపాడుతున్నారు. ప్రతీ ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా ఈ వేడుకను ఆడంబరంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కెనడాలోని టోరంటలో బతుకమ్మ వేడుకలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలను తెలుగువారు అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించుకున్నారు. ఈ సంబరాల్లో 3500 మంది పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు.

    విదేశాల్లో ఉన్నా తెలంగాన సాంప్రదాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఇక్కడి పద్ధుతుల్లోనే బతుకమ్మ వేడుకలను నిర్వహించడం విశేషం. టోరంటోలోని ఆనాపిలిస్ హాల్ -మిస్సిసాగాలో తెలుగు మహిళలంతా ఒక్కచోట చేరి బతుకమ్మలను మధ్యలో ఉంచి చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. దాండియా ఆటలు ఆడుతూ సందడి చేశారు. సుమారు 5 గంటల పాటు నిర్వహించి ఈ వేడుకల అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా పోయిరా బతుకమ్మా అంటూ పాటలు పాడడం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం పిండి పదార్థాలను ఒకరినొకరు పంచుకొని ఆనందంగా గడిపారు. బతుకమ్మలను అందంగా పేర్చిన వారికి ప్రత్యేక బహుమతులు అందించారు.

    బతుకమ్మ తరువాత దసరా వేడులకను కూడా ఘనంగా నిర్వహించుకున్నారు. సంబరాల్లో భాగంగా దుర్గాదేవిని ఘనంగా పూజించి ఆ తరువాత జమ్మిని ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ వంటకాలతో విందు భోజనం చేస్తూ సదండి చేశారు. ఈ వేడుకలకు స్పాన్సర్ గా శిల్పాచందా, శ్రీదేవి కల్లెపల్లి, సుమత కాకర్ల, వైదేహి భగత్, అన్నపూర్ణ లు స్పాన్సర్లుగా వ్యవహరించగా.. వీరిని కెనడా అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మన్నెం ప్రత్యేకంగా సన్మానించారు.

    విదేశాల్లో ఉన్నా తెలుగువారి సాంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో బతుకమ్మ వేడుకలను నిర్వహించిన వారిని అభినందించారు. కొన్ని సంవత్సరాల కిందట 800 మంది ఉన్నవారు ఈ ఏడాది 3500 మంది బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ప్రతీ ఏడాది ఇలాగే వైభవంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని కెనడాలోని భారత సంతతికి చెందిన వారు కోరుతున్నారు.