https://oktelugu.com/

Actress Pragathi: బడా నిర్మాతతో రెండో పెళ్లి.. ఎట్టకేలకు స్పందించిన నటి ప్రగతి.. ఆ రియాక్షన్ వీడియో వైరల్

క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రగతి అందరికీ సుపరితమే. అంతకుమించి అన్నట్లుగా ఆమె యాక్టింగ్ ఉంటుంది. సినిమాల్లో హీరో, హీరోయిన్లతో సమానంగా ఆమెకు గుర్తింపు ఉంటుంది. తల్లిగా, అక్కగా, వదినగా ఎన్నో పాత్రల్లో అలరించిన ప్రగతి ఇటీవల సినిమాల్లో కనిపించడం తగ్గించారు.

Written By:
  • Srinivas
  • , Updated On : October 30, 2023 / 12:01 PM IST
    Follow us on

    Actress Pragathi: తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలపై సీనియర్ నటి ప్రగతి సీరియస్ అయ్యారు. తానెలాంటి నిర్ణయం తీసుకోకపోయినా తప్పుడు వార్తలు సృష్టించిన వారిపై ఫైర్ అయ్యారు. ఒక బాధ్యతాయుతమైన పత్రిక ఇలాంటి వార్తలు ప్రచురించడం చాలా దారుణమని మండిపడ్డారు. ఒక వ్యక్తి మీద ఇలాంటి వార్తలు సృష్టించా రాయడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ వీడియోను షూట్ చేసిన ప్రగతి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అవుతోంది. ఇంతకీ ప్రగతి ఏం మాట్లాడారంటే?

    క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రగతి అందరికీ సుపరితమే. అంతకుమించి అన్నట్లుగా ఆమె యాక్టింగ్ ఉంటుంది. సినిమాల్లో హీరో, హీరోయిన్లతో సమానంగా ఆమెకు గుర్తింపు ఉంటుంది. తల్లిగా, అక్కగా, వదినగా ఎన్నో పాత్రల్లో అలరించిన ప్రగతి ఇటీవల సినిమాల్లో కనిపించడం తగ్గించారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటారు. ముఖ్యంగా ఆమె వర్కౌట్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి.

    సినిమాల్లో సక్సెస్ ఫుల్ జీవితాన్ని కొనసాగిస్తున్న ప్రగతి పర్సనల్ లైఫ్ విషాదం అని చెప్పొచ్చు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్న ప్రగతి ఆ తరువాత మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే అప్పటి నుంచి ప్రగతి రెండో పెళ్లి చేసుకోలేదు. కానీ ఆమె గురించి నిత్యం రెండో పెళ్లి చేసుకుంటుందనే వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ప్రగతి ఓ ప్రముఖ నిర్మాతను పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

    అయితే ఓ ప్రధాన పత్రికను బేస్ చేసుకొని ప్రగతి ఫైర్ అయ్యారు. ఒక రెస్పాన్స్ న్యూస్ రాసే పత్రిక ఇలా వ్యక్తిగతంగా తప్పుడు వార్తలు రాయాలని ఎలా అనిపపిస్తుంది? అని అన్నారు. సినిమా వాళ్ల వార్తలు మీడియాలో హైలెట్ అవుతూ ఉంటాయి. వీటిలో కొన్ని నిజమవుతూ ఉంటాయి. మరికొన్ని ఫేక్ అవుతాయి. అయితే తనపై వచ్చిన వార్తలపై ప్రగతి స్పందించారు. ఎవరిపైనా వార్తలు రాసేటప్పుడు ముందుగా నిజనిజాలు తెలుసుకోవాలని అన్నారు. పెద్ద వార్త పత్రికలు కూడా ఇలాంటి న్యూస్ రాయాలని ఎలా అనిపిస్తుంది? అని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.