Arnold Schwarzenegger, Maria Shriver: టాలీవుడ్‌లో ముచ్చటైన జంటగా ఉన్న నాగచైతన్య అక్కినేని, సమంత విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. వారు కలిసి మెలిసి ఉండాలని చాలా మంది కోరుకున్నారు. కానీ, అలా జరగలేదు. డైవోర్స్ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేసి ఎవరి బాటలో వారు ముందుకు సా..గుతున్నారు. తాజాగా నాగచైతన్య, సమంత బాటలో మరో స్టార్ కపుల్ వెళ్లారు. తాము కూడా విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ సెలబ్రిటీ దంపతులు ఎవరంటే..

నాలుగేళ్ల పాటు వైవాహిక బంధంలో ఉన్న నాగచైతన్య, సమంత తమ బంధానికి స్వస్తి పలికారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా తన రెండో భార్య కిరణ్ రావుకు డైవోర్స్ ఇచ్చాడు. తాజగా విడాకులు తీసుకున్న లిస్ట్‌లో ఆర్నాల్ చేరాడు. ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ తన వైఫ్ మరియా శ్రివర్‌కు డైవోర్స్ ఇచ్చాడు. వీరిరువురు పదేళ్ల కిందట డైవోర్స్ కు అప్లై చేసుకున్నారు. కాగా, ఎట్టకేలకు స్థానిక కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. వీళ్లిద్దరి మధ్య ఆస్తులకు సంబంధించిన ఫైనల్ సెటిల్‌మెంట్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ విషయాలను అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఓ పత్రికలో కథనంగా ప్రచురించారు.
Also Read: సడన్ గా థియేటర్ లో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి.. అభిమానులంతా షాక్?
అలా..ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్, మరియా శ్రివర్ 35 ఏళ్ల వైవాహిక బంధం ముగిసింది. ఆర్నాల్డ్ భార్య యూఎస్ మాజీ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీకి మేనకోడలు కాగా, ఆర్నాల్డ్ కాలిఫోర్నియా గవర్నర్‌గా పనిచేసిన సంగతి అందరికీ విదితమే. వీరిరువురు 1986లో మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి నలుగురు సంతానం. బాడీ బిల్డర్ గా ఉంటూనే సినిమాల్లోకి ఎంట్రీ ఇఛ్చి పాపులర్ అయ్యాడు ఆర్నాల్డ్. తన కెరీర్‌లో టెర్మినేటర్ సిరీస్ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలతో ఆర్నాల్డ్ ఎనలేని ఖ్యాతి లభించింది. ఈ ఫిల్మ్ ద్వారా వచ్చిన పాపులారిటీతోనే ఆర్నాల్డ్ అమెరికాలోని కీలక రాష్ట్రమైన కాలిఫోర్నియా రాష్ట్రానికి గవర్నర్ అయ్యారు.
ఇకపోతే ఆర్నాల్డ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే .. తన భార్యతో డైవోర్స్ విషయమై చాలా కాలం నుంచి వార్తలు వస్తుండగా, ఎట్టకేలకు డైవోర్స్ కన్ఫర్మ్ అయింది. ఆర్నాల్డ్ సినిమా హిస్టరీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారని ఈ సందర్భంగా ఆయన అభిమానులు చెప్తుంటారు. ఆర్నాల్డ్ బాడీ బిల్డర్‌గా తొలుత కొన్ని సినిమాలు చేసినప్పటికీ ‘టర్మినేటర్’ సినిమాలతో బాగా గుర్తింపు వచ్చింది. ఆర్నాల్డ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇండియాలోనూ ఆర్నాల్డ్ సినిమాలను సినీ లవర్స్ అత్యంత ఆసక్తిగా చూస్తుంటారు.
Also Read: చరణ్ నాలో సగ భాగం.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్!