APTA 15th Anniversary : ఆప్త 15 సంవత్సరాల వేడుకలు.. 3వ రోజు ఆట పాటలు, విందు వినోదాలతో ఘనంగా ముగిశాయి

మొత్తంగా ఆప్త 15 సంవత్సరాల సంబరాలు విందు వినోదాలతో, ఆట పాటలతో, రాజకీయ, వ్యాపార మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో కన్నుల పండుగగా ముగిశాయి

Written By: NARESH, Updated On : September 4, 2023 12:58 pm

APTA 15th Anniversary

Follow us on

APTA 15th Anniversary : అమెరికాలోని అట్లాంటాలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA) 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నారు.  మూడు రోజుల పాటు కొనసాగనున్న వేడుకల్లో భాగంగా మూడో రోజు కార్యక్రమాలు అంబరాన్ని తాకాయి.  వివిధ కార్యక్రమాల్లో సినీ, రాజకీయ, పారిశ్రామివేత్త ప్రముఖులు పాల్గొన్నారు.

అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటలకి వద్దిపర్తి పద్మాకర్ గారి అష్టావధానం కార్యక్రమం తో చివరి రోజు కార్యక్రమాలు మొదలయ్యాయి. 8 మంది వృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు వద్దిపర్తి పద్మాకర్ గారు ఛలోక్తులు విసురుతు ఇచ్చిన సమాధానాలు ప్రేక్షకుల ప్రత్యేక మన్ననలు పొందాయి.

జనసేన లీడర్స్ శ్రీ సత్య బొలిశెట్టి, డాక్టర్ హరి ప్రసాద్, శ్రీ బండ్రెడ్డి రామ్ తో నిర్వహించిన పొలిటికల్ ఫోరమ్,  బండి సంజయ్ తో మీట్ అండ్ గ్రీట్,  కళ్యాణ్ దిలీప్ సుంకర సామజిక రాజకీయ విశ్లేషణలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించాయి.

చివరిగా మణిశర్మ తన సంగీత విభావరి తో ప్రేక్షకులని ఉర్రూతలూగించారు. ఆ కార్యక్రమంలో భాగంగా చివరి రోజు దాతలను, కన్వెన్షన్ కమిటీలలో కృషి చేసిన వారిని, ఆప్త ఎగ్జిక్యూటివ్ టీం లను సత్కరించారు.

ఈ కార్యక్రమాలకి రాజకీయ సినిమా రంగాల నుంచి విచ్చేసిన ప్రత్యేక అతిథులైన సత్య బొలిసెట్టి, బొత్స సత్యనారాయణ, బండి సంజయ్, హరి ప్రసాద్ పసుపులేటి, రామ్ బండ్రెడ్డి, కళ్యాణ్ దిలీప్ సుంకర, కదిరి బాబురావు, మున్నా ధూళిపూడి అంగన రాయ్, సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, సంపత్ నంది, మెహ్రీన్ ఫిర్జాధ, లయ, అనంత్ శ్రీరామ్, ఆస్కార్ విజేత చంద్రబోస్ తదితురులకు ఆప్త అధ్యక్షులు ఉదయ్ భాస్కర్ కొట్టే గారు ,  కన్వీనర్ విజయ్ గుడిసేవ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మొత్తంగా ఆప్త 15 సంవత్సరాల సంబరాలు విందు వినోదాలతో, ఆట పాటలతో, రాజకీయ, వ్యాపార మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో కన్నుల పండుగగా ముగిశాయి