Bigg Boss 7 Telugu Rathika Rose: బుల్లితెర రియాల్టీ షోలో ఎక్కువ పాపులారిటీ పొందిన షో బిగ్ బాస్. గత సీజన్ జరిగిన కొన్ని తప్పిదాల కారణంగా షో కి సంబంధించి ప్రేక్షకులు చాలా నిరాశ చెందారు. అందుకే ఈసారి ఎలాగైనా పోగొట్టుకున్న సేమ్ తిరిగి తెచ్చుకోవడం కోసం సీజన్ సెవెన్ ను అంగరంగ వైభవంగా డిజైన్ చేశారు. నిన్న ఎంతో గ్రాండ్ గా స్టార్ట్ అయిన ఈ షోలో చిరంజీవి సాంగ్ తో నాగార్జున ఎంట్రీ ఇవ్వడం ఒక విశేషం.
షోలో భాగంగా బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా పదో కంటెస్టెంట్ అయినా రతికా…. బిగ్బాస్ లో అడుగు పెట్టి పెట్టగానే నాగార్జునతో పులిహోర కలిపేసింది. చూడడానికి సూపర్ యాక్టివ్ గా ఉన్న ఈ కంటెస్టెంట్ రాబోయే రోజుల్లో బిగ్ బాస్ హౌస్ లో హంగామా చేయడం కన్ఫామ్ అని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇంతకీ ఈ రతిక ఎవరు.. ఇంతకుముందు ఏ సినిమాలో నటించింది …అనే వివరాలు తెలుసుకోవడానికి చాలామంది తహతహలాడుతున్నారు. ప్రస్తుతం బిగ్బాస్ హౌస్ లో హల్చల్ చేయడానికి రెడీ అయిన ఈ బ్యూటీ పేరు రతికా రోజ్.. నిన్నటి వరకు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పేరే.. కానీ రాబోయే రోజుల్లో బిగ్బాస్ సీజన్ సెవెన్ పుణ్యమా అని బాగా పాపులర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది మరి. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి రతికా ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు లీక్ అయినప్పుడు అందరూ రాబోయేది అశోక వనంలో అర్జున్ కళ్యాణం హీరోయిన్ రితికా నాయక్ అనుకున్నారు.
అయితే వచ్చింది రితికా కాదు రతికా… రతికా రోజ్. ఇంతకీ ఈమెను ఎక్కడ చూసామా అనుకుంటున్నారా…నాచురల్ స్టార్ నాని దసరా మూవీలో బాగా హిట్ అయిన చమ్కీలా అంగిలేసి సాంగ్ కు స్టేప్పులు వేసి అందరినీ ఆకట్టుకుంది ఆకట్టుకుంది. నటిగానే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా రతికా కు మంచి క్రేజ్ ఉంది. షో లో అడుగు పెట్టి పెట్టగానే అందరికీ షాక్ ఇచ్చే నాగార్జునకే.. హార్ట్ బ్రేక్ చేసింది నువ్వే అంటూ హార్ట్ స్ట్రోక్ తెప్పించింది. కెరియర్ మొదటి దశలో చిన్న చిన్న పాత్రలకు పరిమితమైన ఈమె 2020లో షకలక శంకర్ నటించిన బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది చిత్రంతో బాగా పాపులర్ అయింది. రతికా ఎనర్జీ ,ఎంట్రీ ఇచ్చిన తీరు చూస్తే బిగ్ బాస్ హౌస్ లో చిన్న సైజు సునామీ సృష్టించక మానదు అని అందరూ అభిప్రాయపడుతున్నారు.