Dr.Uma.R.Katiki : అనాథ అమ్మలకు నేనున్నానని.. తానా కల్చరల్ సర్వీస్ కో-ఆర్డినేటర్ డా.ఉమా.ఆర్. కటికి సేవాతత్పరత

ఈ సందర్భంగా డా.ఉమ ఆర్. కటికి గారు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న తల్లులు, కుటుంబాలకు సహాయ అందించే అవకాశం మాతృ దినోత్సవం రోజే రావడం గొప్ప విషయమన్నారు.

Written By: NARESH, Updated On : May 12, 2024 6:44 pm

Thana Cultural Service Coordinator Dr. Uma R. Katiki

Follow us on

Dr.Uma.R.Katiki : అందరినీ కనే శక్తి అమ్మకు మాత్రమే ఉంటుంది అని ఓ సినీకవి అన్నట్లు అమ్మ ఓ వ్యక్తి కాదు శక్తి. లోకాన్ని నడిపించే అద్వితీయమైన శక్తి. అమ్మ అనే పిలుపులో ఎంతో మాధుర్యం. పిలిచే భాష వేరైనా భావం మాత్రం ఒక్కటే. సృష్టిలో ప్రతీ జీవికి అమ్మ విలువల తెలుసు. అమ్మ ప్రేమ తెలుసు. బిడ్డల కోసం సర్వం త్యాగం చేసేది తల్లి మాత్రమే. కానీ ఏనాడు నా బిడ్డల కోసం నేను ఇది చేశాను అని చెప్పుకోదు. బిడ్డల కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టేది ఒక్క తల్లి మాత్రమే. బిడ్డలే లోకంగా బతికేది కన్న తల్లి మాత్రమే.

అనాథ అమ్మలకు అండగా..
సాధారణంగా మనకు సాయం చేసిన వారికి మనం థాంక్స్‌ చెబుతాం. వీలైతే సాయం చేసిన వారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటాం. కానీ అమ్మకు థాంక్స్‌ చెప్పొదు. ఏమీ ఆశించకుండా సేవ చేసేదే తల్లి. దేవత లాంటి అమ్మకు థాంక్స్‌ చెబితే ఆమె విలువను తగ్గించినట్లే. తల్లి మనసు మరో తల్లికే తెలుసు అన్నట్లు.. తానా కల్చరల్ సర్వీస్ కో-ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న డా.ఉమా ఆర్. కటికి గారు తన సేవా హృదయాన్ని చాటుకుంటున్నారు..

అందరూ ఉన్నా.. అనాథలుగా ఆశ్రమంలో ఉంటున్న తల్లుల మోములో మాతృ దినోత్సవం రోజు ఆనందం నింపాలనుకున్నారు. ఇందుకోసం తన వంతుగా అమెరికాలోని ఓ ఆశ్రమం వద్దకు వెళ్లి… వారికి అవసరమైన వస్తువులతోపాటు మిఠాయిలు అందించారు. దీంతో అక్కడ ఉన్న తల్లుల మోములో ఆనందం వెల్లివిరిసింది.

– తానా మరియు లీడ్‌ ది పాత్‌ ఫౌండేషన్‌ తరఫున..

మాతృ దినోత్సవం రోజు అయినా అనాథ తల్లుల మోములో చిరు నవ్వు వికసించాలన్న సంకల్పంతో ‘‘తెలుగు అసోషియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (TANA)’’ ఆధ్వర్యంలోని ‘‘లీడ్‌ ది పాత్‌ ఫౌండేషన్‌’తో కలిసి ఆపదలో ఉన్న తల్లులకు సాయం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తానా కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్ డా.ఉమ ఆర్. కటికి గారితోపాటు వలంటీర్లు ముందుకు వచ్చారు. గృహ హింసకు గురై ఆశ్రమంలో ఉంటున్న తల్లుల వద్దకు వెళ్లారు. వారి సమక్షంలోనే మాతృ దినోత్సవం నిర్వహించారు. తల్లిగా వారి సేవలను ఈ సందర్భంగా ఆశ్రమంలోని మహిళలు వివరించారు. అనంతరం తమ వెంట తెచ్చిన నిత్యావసరాలతోపాటు కొంత నగదును బాధిత తల్లులకు అందించారు.

-గొప్ప అవకాశం..

ఈ సందర్భంగా డా.ఉమ ఆర్. కటికి గారు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న తల్లులు, కుటుంబాలకు సహాయ అందించే అవకాశం మాతృ దినోత్సవం రోజే రావడం గొప్ప విషయమన్నారు. ఇది చాలా మందిలో స్ఫూర్తి నింపుతుందని పేర్కొన్నారు. అందరిలో తల్లులపై ఉన్న ప్రేమను మరింత వ్యాప్తి చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఆశ్రమంలోని తల్లుల కష్టాలు తమకు ఎంతో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. మరోసారి ఆశ్రమంలో ఉన్న తల్లులకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాధికా గరిమెల్ల, గౌరీ శంకర్ అద్దంకి పాల్గొన్నారు.