Mudragada Padmanabham: ముద్రగడ ఇక పద్మనాభ రెడ్డి గా పిలిపించుకుంటారా?

ముద్రగడ పద్మనాభం ఒకానొక దశలో జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ పవన్ ఆహ్వానించపోయేసరికి చిన్నబుచ్చుకున్నారు.

Written By: Dharma, Updated On : June 4, 2024 7:17 pm

Mudragada Padmanabham

Follow us on

Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం ఇప్పుడు సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు. పవన్ పిఠాపురంలో ఓడిపోతే తాను పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సవాల్ ను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో జనసైనికులు, నెటిజెన్లు ప్రశ్నించడం ప్రారంభించారు. వైసీపీలో చేరిన ముద్రగడ పవన్ ను టార్గెట్ చేసుకున్నారు. పిఠాపురంలో పవన్ ఓడిస్తానని శపధం చేశారు. అంతటితో ఆగకుండా పవన్ గెలిస్తే తాను ముద్రగడ పద్మనాభ రెడ్డి గా పేరు మార్చుకుంటానని కూడా సవాల్ చేశారు. అది కూడా మీడియా ముఖంగానే. ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలోకి రావడం, పిఠాపురంలో పవన్ భారీ మెజారిటీతో గెలవడంతో జనసైనికులు ముద్రగడను టార్గెట్ చేయడం ప్రారంభించారు.

ముద్రగడ పద్మనాభం ఒకానొక దశలో జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ పవన్ ఆహ్వానించపోయేసరికి చిన్నబుచ్చుకున్నారు. నేరుగా తాడేపల్లి కి వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అటు జగన్ సైతం పిఠాపురం బాధ్యతలను ముద్రగడకు అప్పగించలేదు. ఆయన కుమారుడికి ఎటువంటి టిక్కెట్టు కేటాయించలేదు. వైసీపీ అధికారంలోకి వస్తే రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే వైసీపీలో చేరిన నాటి నుంచి ముద్రగడ పవన్ ను టార్గెట్ చేసుకోవడం ప్రారంభించారు. పిఠాపురంలో పవన్ ను ఓడిస్తానని.. అలా చేయకుంటే తన పేరును మార్చుకుంటారని కూడా చెప్పుకొచ్చారు. అయితే అనూహ్యంగా ముద్రగడ కుమార్తె నుంచి పవన్ కళ్యాణ్ కు మద్దతు లభించింది. ముద్రగడ చేసిన వ్యాఖ్యలను సొంత కుటుంబ సభ్యులు సైతం తప్పుపట్టారు.

అయితే ఇప్పుడు పవన్ గెలుపుతో జనసైనికులు జోష్ తో ఉన్నారు. తెగ సందడి చేస్తున్నారు. ఈ తరుణంలో గతంలో ముద్రగడ చేసిన శపధాన్ని గుర్తు చేస్తున్నారు. పద్మనాభ రెడ్డి గా పేరు మార్చుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఉదయం జనసేన లీడింగ్ లోకి వచ్చిన నాటి నుంచి కొన్ని మీడియా ఛానల్స్ సైతం ముద్రగడ శపధాన్ని గుర్తుచేశాయి. దీంతో ఇవి విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే సీఎం జగన్ ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. అటు ఓటమిపై స్పందించేందుకు వైసిపి నేతలు ఎవరు ముందుకు రావడం లేదు. మరి ముద్రగడ పద్మనాభం ఆ శపథంపై ఎటువంటి ప్రకటన చేస్తారో? అన్నది తెలియాల్సి ఉంది.