https://oktelugu.com/

Acharya: ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి ఎవరంటే?

Acharya Pre-Release Event: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబోలో ‘ఆచార్య’ మూవీ రాబోతోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ‘ఆచార్య’ సినిమాను ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం చిత్రబృందం ప్రమోషన్స్ ను అదిరిపోయే రేంజులో చేస్తోంది. ఇటీవలే ‘ఆచార్య’ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఎంట్రీతో […]

Written By:
  • NARESH
  • , Updated On : April 16, 2022 / 01:39 PM IST
    Follow us on

    Acharya Pre-Release Event: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబోలో ‘ఆచార్య’ మూవీ రాబోతోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ‘ఆచార్య’ సినిమాను ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం చిత్రబృందం ప్రమోషన్స్ ను అదిరిపోయే రేంజులో చేస్తోంది.

    ఇటీవలే ‘ఆచార్య’ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఎంట్రీతో ప్రారంభమైన ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీతో పీక్స్ కు చేరింది. వీరిద్దరి కాంబినేషన్లలో వచ్చిన యాక్షన్ సీన్స్, సాంగ్ కు మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

    ఆచార్య ట్రైలర్ తోనే దర్శకుడు కొరటాల శివ ఈ మూవీ ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పాడు. ‘ఆచార్య’ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కొరటాల మార్క్ సోషల్ మెసేజ్ ఉంటుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఆచార్య మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ పై త్వరలోనే చిత్రబృందం అధికారిక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతోంది.

    విశ్వసనీయ సమాచారం ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 23న విజయవాడలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ముందుగా ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం మేరకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారట.

    ఒకే వేదికపైకి మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రానుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గత కొంతకాలంగా చిరంజీవి, సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహిత సంబంధాలు నెలకొన్నాయి. ఏపీలో సినిమా టికెట్ల వివాదానికి సైతం జగన్మోహన్ రెడ్డి ఇటీవల ముగింపు పలికారు.

    మరోవైపు జగన్ అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి సినీ పరిశ్రమకు పలురకాల ప్రోత్సాహాలు అందిస్తున్నారు. ఏపీలో సినిమాలు చేసుకునేందుకు ప్రభుత్వం ఫ్రీగా అనుమతి ఇస్తోంది. కరోనా సమయంలో థియేటర్ల విద్యుత్ బకాయిలు మాఫీ చేసింది. అదేవిధంగా 20శాతం ఏపీలో షూటింగ్ చేసిన సినిమాలకు సైతం టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ‘ఆచార్య’ వేదిక నుంచి సినిమా పరిశ్రమకు మరోసారి ఏవైనా వరాలు ప్రకటిస్తారా? అనేది ఆసక్తిని రేపుతోంది.