Jobs: ప్రసార భారతి హౌస్ జర్నలిజంలో డిగ్రీ చేసిన వాళ్లకు తీపికబురు అందించింది. ఆరు ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం. సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ మీడియాలో డిగ్రీ లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు.
50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు 50,000 రూపాయల నుంచి 55,000 రూపాయల వరకు వేతనం లభించే ఛాన్స్ అయితే ఉంటుంది. రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం. https://prasarbharati.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను ప్రసార భారతి వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవాలి. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అనుభవం తప్పనిసరి. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు హిందీ, ఇంగ్లీష్ భాషలలో నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి.
పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్ అయిన ప్రసార భారతి సెక్రటేరియట్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండటం గమనార్హం. తక్కువ సంఖ్యలో ఖాళీలు ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువని చెపప్వచ్చు.