Andhra Pradesh: తెలుగు ఇండస్ట్రీ ఉనికి సమస్యలో పడిందా ? అయినా తెలుగు సినిమా రంగం ఎన్నో చూసింది. గతంలో ఎన్నో అవరోధాలను అడ్డంకులను ఎదుర్కొంది. అయితే, అప్పట్లో హీరోలు వేరు, వారి విధానాలు వేరు. సక్సెస్ వస్తే రెమ్యునరేషన్ వాళ్ళు పెంచేవాళ్ళు కాదు. నిర్మాతలను అడిగి వారి అభిప్రాయాలను తీసుకుని.. అలాగే ప్రేక్షకుల పై భారం లేకుండా.. ముఖ్యంగా బీసీ ఆడియన్స్ టికెట్ కొనుక్కునే పరిస్థితి ఉందా ? లేదా ? అని ఆలోచించి రెమ్యునరేషన్ ను పెంచుకునేవాళ్ళు.

ఎన్టీఆర్, ఏఎన్నార్, ఆ తర్వాత తరం కృష్ణ, శోభన్ బాబు ఇలాగే చేసేవాళ్ళు. కానీ నేటి తరంలో పోటీ ఎక్కువ అయింది. ఎవరు ఎంత ఎక్కువ తీసుకుంటే.. ఆ హీరోకి అంత ఫాలోయింగ్ అన్న కోణంలోకి ప్రేక్షకులు కూడా వెళ్లిపోయారు. దాంతో సహజంగానే టికెట్ రేట్లు ఆకాశాన్ని అంటాయి. అన్నీ చోట్ల ఇలాగే జరుగుతుంది కాబట్టి.. ఏపీలో కూడా ఇలాగే ఉండాలి అని హీరోలు అడుగుతున్నారు.
కానీ జగన్ నిర్ణయం మరోలా ఉంది. దాంతో ఏపీలో ఉన్న టిక్కెట్ రేట్లు బాగా తగ్గాయి. దాంతో ఇక మేము థియేటర్లను మూసేసుకోవడం మంచిదని ఎగ్జిబిటర్‌గా సురేష్ బాబు కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ కి జగన్ ప్రభుత్వం చెబుతున్న మాటలు.. మూసేసుకుంటే చిన్న సినిమా వాళ్లకు కూడా థియేటర్స్ దొరుకుతాయి. కాబట్టి.. మీరు థియేటర్స్ ను మూసేసుకోండి అంటున్నారు.
Also Read: ఏపీకి పొంచి ఉన్న మరో భారీ ముప్పు
నిర్మాతగా భారీ సినిమాలు తీసి భారీగా వసూళ్లు చేస్తాం అంటే ఎలా ? మీ ఇష్టం వచ్చినట్టు టికెట్ రేటు పెట్టలేదు కాబట్టి.. ఇక పెద్ద సినిమాలను ఏపీలో రిలీజ్ చేసుకోవడం దండగ అని ఓ భారీ నిర్మాత అన్నారు. ఏ రకంగా చూసినా ఏపీలో ఖరారు చేసిన టిక్కెట్ రేట్లు మాత్రమే ఉండేలా ఉన్నాయి. మరి నిజంగానే భారీ సినిమాలను ఏపీలో రిలీజ్ చేయడం మానేస్తారా ?
అలాగే అదనపు షోల విషయంలో కూడా జగన్ అనుమతి లేదు. మరి ఇప్పుడు హీరోలు, నిర్మాతలు ఏమి చేస్తారు ? ఏది ఏదైనా సినిమా ఇండస్ట్రీకి జగన్ నిర్ణయం ఏమాత్రం అనుకూలం కాదు అంటున్నారు. మరి ఈ సినిమా టిక్కెట్ రేట్ల విషయం తేలేది ఎప్పుడు ? ఆ నిర్మాత చెప్పినట్టు.. పెద్ద సినిమాలు ఏపీలో రిలీజ్ చేయడం ఇక దండగేనా ?