Viral Wedding: ప్రేమ.. ఈ పదానికి జాతి, మతం, కులం అనే బేధం ఉండదు. అలాగే ప్రాంతాలు కూడా ప్రేమకు అతీతం కాదు. ఈ విషయాన్ని మరొకసారి నిరూపించారు ఈ నవ జంటలు. ఆంధ్రా ప్రదేశ్ కు చెందిన ఇద్దరు యువకులు వృత్తి రీత్యా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ యువతులను ప్రేమించారు. తమ ప్రేమకు పెద్దల అంగీకారం కూడా అందడంతో సంతోషంగా మూడు ముళ్ల తో ఒక్కటయ్యారు.

హిందూ సంప్రదాయం ప్రకారం పెద్దల సమక్షంలో మూడు ముళ్ళు వేసి ఏడూ అడుగులతో ఒక్కటయ్యారు. వారి ప్రేమను పెద్దల వరకు తీసుకు వచ్చి వివాహ బంధం గా మార్చుకున్నారు. ఈ పెళ్లిళ్లలో ఒక పెళ్ళికి ఆంధ్రా ప్రదేశ్ లోని విశాఖ పట్నం వేదిక కాగా.. రెండవ పెళ్ళికి గుంటూరు వేదిక అయ్యింది. వీరి పెళ్లిళ్ల గురించి, ప్రేమ గురించి తెలుసుకోవాలి అంటే పూర్తి వివరాలు తెలియాల్సిందే..
Also Read: ఆడపిల్లలకు ఉపద్రవం.. ఏంటీ కొత్త మార్పులు
విశాఖ పట్నం జిల్లా కె కోటపాడు మండలం కింతాడ గ్రామా సర్పంచ్ బండారు ఈశ్వరమ్మ, ముత్యాల నాయుడు దంపతుల కుమారుడు నరేష్.. రష్యాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ తనతో పాటు రష్యాకు చెంసిన యువతీ ఇరీనా తో నరేష్ ప్రేమలో పడ్డాడు. తమ ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. వరుడి గ్రామంలో ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి ఇరీనా తల్లిదండ్రులు కూడా భారతీయ దుస్తులు ధరించి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. నరేష్, ఇరీనా దంపతులను బంధుమిత్రులు ఆశీర్వదించారు.
ఇక బుధవారం మరొక పెళ్లి జరిగింది. ఆంధ్ర అబ్బాయి.. విదేశీ అమ్మాయి మెడలో బంధుమిత్రుల సమక్షంలో వేద మంత్రాల నడుమ మూడు ముళ్ళు వేసాడు. ఈ పెళ్లి వేడుక గుంటూరులో జరిగింది. ఆత్మ డెప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ధమ్మాటి వెంకటేశ్వర్లు కుమారుడు మధు సంకీర్త్ ఉద్యోగ రీత్యా టర్కీలో స్థిరపడ్డాడు. తనతో పాటు పని చేస్తున్న టర్కీకి చెందిన గిజిమ్ ను ప్రేమించి పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయ పద్ధతిలో ఒక్కటయ్యారు. వీరి వివాహం అంగరంగ వైభవంగా బంధుమిత్రుల మధ్య జరిగింది.
Also Read: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. సఫారీల గడ్డపై టీమిండియా చారిత్రక విజయం