
నెల రోజుల్లో హైదరాబాద్ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పీఎం కేర్స్ నిధులతో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో కేవలం రెండు వ్యాక్సిన్ టెస్టింగ్ కేంద్రాలే ఉన్నాయి. హైదరాబాద్ లో మూడో వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు కాబోతోందని తెలిపారు.