
జూన్ తరువాత వ్యాక్సినేషన్ ప్రక్రియ తిరిగి గాడిలో పడుతుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ లో వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి పెరుగుతుందని, అందుకే వ్యాక్సినేషన్ గాడిలో పడుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఆదివారం ఓ వర్క్ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 12 కోట్ల డోసులకు ఏక కాలంలో డబ్బులు చెల్లించడానికి తాము రెడీగా ఉన్నామని, దీని ద్వారా 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్న వయస్సు గల వారికి వ్యాక్సినేషన్ లభిస్తుందన్నారు.