https://oktelugu.com/

ఇండియన్ ఆర్మీకి సోనూ సూద్ షాక్

దేశంలో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా చేయలేని పనిని ప్రముఖ నటుడు సోనూ సూద్ చేస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా సైతం ఎంతో మంది పేదలు, వలస కార్మికులు, కరోనా రోగులను ఆదుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాడు. అయితే దేశానికి ఇంత సేవ చేస్తున్న సోనూ సూద్ కు ఓ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ నుంచి లేఖ అందడం విశేషం. రాజస్థాన్ లోని జైసల్మీర్ లో ఇన్ఫాంట్రీ బెటాలియన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 23, 2021 / 05:18 PM IST
    Follow us on

    దేశంలో ఇప్పుడు ప్రభుత్వాలు కూడా చేయలేని పనిని ప్రముఖ నటుడు సోనూ సూద్ చేస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా సైతం ఎంతో మంది పేదలు, వలస కార్మికులు, కరోనా రోగులను ఆదుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాడు.

    అయితే దేశానికి ఇంత సేవ చేస్తున్న సోనూ సూద్ కు ఓ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ నుంచి లేఖ అందడం విశేషం. రాజస్థాన్ లోని జైసల్మీర్ లో ఇన్ఫాంట్రీ బెటాలియన్ కు చెందిన ఓ కమాండింగ్ మిలటరీ ఆఫీసర్ (సీఓ) సోనూ సూద్ కు ఓ లేఖ రాశారు. కరోనా తగ్గించేందుకు ఏమేం కావాలో రాసి సాయం చేయాల్సిందిగా కోరారు. జైసల్మీర్ మిలటరీ స్టేషన్ దగ్గర 200 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ లేఖ రాసిన మాట వాస్తవమేనని ఢిల్లీలోని ఇండియన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని ఓ సీనియర్ ఆఫీసర్ ఇది వాస్తవమేనన్నారు. అత్యుత్సాహంతోనే ఇలా రాశాడని చెప్పుకొచ్చారు.

    కరోనా కల్లోలంలో ఇండియన్ ఆర్మీ కూడా ఇప్పుడు ప్రజలకు సేవ చేస్తోంది. తక్షణం ఆస్పత్రులు ఏర్పాటు చేస్తూ కరోనా నివారణలో పాలు పంచుకుంటోంది. రోగులు, ఆస్పత్రుల నిర్మాణం, ఆక్సిజన్ ట్యాంకుల సరఫరా.. వివిధ దేశాల నుంచి వస్తున్న సాయాలను ఆయా రాష్ట్రాలకు పంచుతూ సొంత ఖర్చుతో ముందుకెళుతోంది.

    ఇండియన్ ఆర్మీ కూడా సోనూ సూద్ సాయం కోరడంపై నెటిజన్లు తలో రకంగా కామెంట్ చేస్తున్నారు. దీన్ని వైరల్ చేస్తున్నారు. అయితే సోనూ సూద్ మాత్రం దీనిపై స్పందించలేదు. తన ప్రాధాన్యత అంతా పేదలకు సేవ చేయడం మాత్రమేనని ముందుకెళుతున్నారు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ లేక దేశంలో వైరల్ గా మారింది.