Upasana Adopts Tiger: సరిగ్గా నేటికి రామ్ చరణ్(Global Star Ram Charan), ఉపాసన(Upasana Konidela) దంపతులు తల్లితండ్రులై రెండేళ్లు కావొస్తుంది. వీళ్ళ జీవితంలోకి క్లిన్ కారా అనే చిట్టి తల్లి రెండేళ్ల క్రితం అడుగుపెట్టింది. ఏ ముహూర్తం లో ఈ చిన్నారి మెగాఫ్యామిలీ లోకి అడుగుపెట్టిందో తెలియదు కానీ, అన్ని శుభాలే జరిగాయి. కొణిదెల కుటుంబం పాలిట అదృష్ట దేవత లాగా ఆ కుటుంబ సభ్యులతో పాటు మెగా అభిమానులు కూడా భావిస్తూ ఉంటారు. నేడు క్లిన్ కారా పుట్టిన రోజు సందర్భంగా మెగా అభిమానులు సోషల్ మీడియా లో ఆ చిట్టి తల్లికి శుభాకాంక్షలు వెల్లువలాగా కురిపిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో క్లిన్ కారా పేరిట అర్చనలు చేయించి, అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే క్లిన్ కారా పుట్టినరోజు సందర్భంగా ఉపాసన అభిమానులతో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది.
ఆమె మాట్లాడుతూ ‘సరిగ్గా ఏడాది క్రితం మేము ఒక పులి పిల్లను మా కుటుంబం లోకి చేర్చుకున్నాము. నేడు ఆ పులి పిల్ల పెద్దదై ఆడుకునే స్థాయికి వచ్చింది. నేడు క్లిన్ కారా పుట్టినరోజు సందర్భంగా ఈ పులి కి కూడా క్లిన్ కారా అనే పేరు పెట్టాము. మాకు ఈ పులి పిల్లను పెంచుకునే అవకాశం ఇచ్చినందుకు హైదరాబాద్ జూ సిబ్బందికి కి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాము’ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ ని అప్లోడ్ చేసింది. దీనికి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జంతువుల పట్ల ఉపాసన కి ఉన్న ప్రేమ పై వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉపాసన కి మాత్రమే కాదు, రామ్ చరణ్ కి కూడా మూగ జీవాలు అంటే మొదటి నుండి ఎంతో ఇష్టం. తాను ఎంతో ఇష్టం గా పెంచుకున్న కుక్కపిల్లని తనతో పాటు ‘మేడం తుస్సాడ్స్’ మ్యూజియం లో పెట్టించాడంటే ఆయనకు మూగ జీవులపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: Ram Charan : రామ్ చరణ్ మీద హాట్ కామెంట్స్ చేసిన ఉపాసన…
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన బుచ్చి బాబు తో కలిసి ‘పెద్ది’ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. కేవలం ఒకే గ్లింప్స్ నేషనల్ వైడ్ గా ఈ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేలా చేసింది. ఇది కదా రామ్ చరణ్ సత్తా అంటే అంటూ అభిమానులు గర్వం గా చెప్పుకున్నారు. గ్యాప్ లేకుండా శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు, హిందీ , తమిళం మరియు ఇతర భాషల్లో విడుదల కానుంది. రీసెంట్ గానే హైదరాబాద్ లో ఒక పవర్ ఫుల్ ట్రైన్ స్టంట్ సన్నివేశాన్ని రామ్ చరణ్ పై చిత్రీకరించారు. ఇది రామ్ చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ గా ఉండిపోతుందట.