Traffic Challan Online: డ్రైవింగ్ చేసేటప్పుడు పొరపాటుగా లేదా తెలియకుండా చాలాసార్లు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తుంటారు. దీనివల్ల భారీ ట్రాఫిక్ చలాన్ పడుతుంది. చలాన్ పడిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు చలాన్ గురించిన మెసేజ్ వస్తుంది. కానీ చాలాసార్లు ప్రజలు ఆ మెసేజ్‌ను మిస్ చేసుకుంటారు. తమకు ట్రాఫిక్ చలాన్ పడిందనే విషయం వారికి తెలియదు. మీరు కూడా ఇంట్లో కూర్చొని మీ వాహనానికి చలాన్ పడిందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాన్ని చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
Also Read : బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతో చేయబోతున్నాడా..?
మూడు విధాలుగా తెలుసుకోవచ్చు:
మీ ట్రాఫిక్ చలాన్ పడిందో లేదో తెలుసుకోవడానికి మీకు మూడు మార్గాలు ఉన్నాయి. మొదటిది చలాన్ నంబర్ ద్వారా, రెండవది వాహన నంబర్ ద్వారా, మూడవది డ్రైవింగ్ లైసెన్స్ (DL) నంబర్ ద్వారా.
ఆన్‌లైన్‌లో ఈ-చలాన్ చెక్ చేసే విధానం
ఆన్‌లైన్‌లో ట్రాఫిక్ చలాన్ చెక్ చేయడానికి https://echallan.parivahan.gov.in/index/accused-challan వెబ్‌సైట్‌కు వెళ్లండి. సైట్‌కి వెళ్లిన తర్వాత మీకు పైన తెలిపిన మూడు ఆప్షన్‌లు కనిపిస్తాయి. మీ సౌలభ్యం ప్రకారం ఏదో ఒక ఆప్షన్ ద్వారా మీ చలాన్ పడిందో లేదో తెలుసుకోవచ్చు.
ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, చలాన్ స్టేటస్ చెక్ చేయడానికి మీరు RTOలో రిజిస్టర్ చేసిన నంబర్‌ను మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే చలాన్ చెక్ చేయడానికి మీరు వివరాలు నమోదు చేసి సబ్మిట్ బటన్ నొక్కినప్పుడు మీ రిజిస్టర్డ్ నంబర్‌కు OTP వస్తుంది. OTPని నమోదు చేసిన తర్వాత మాత్రమే మీకు చలాన్ స్టేటస్ తెలుస్తుంది.
లోక్ అదాలత్ 2025 తదుపరి తేదీ
మీకు చలాన్ పడి ఉంటే, మీరు వచ్చే నెల 10వ తేదీన జరిగే 2025 రెండవ లోక్ అదాలత్‌కు వెళ్లి చలాన్‌ను రద్దు చేయించుకోవచ్చు లేదా చలాన్ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు.
Also Read :