Homeఎంటర్టైన్మెంట్NTR Prashanth Neel Movie Latest Update: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్..మార్చి...

NTR Prashanth Neel Movie Latest Update: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్..మార్చి వరకు ప్లాన్ చేస్తే ఇలా అయ్యిందేంటి పాపం!

NTR Prashanth Neel Movie Latest Update: ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ గురించి సోషల్ మీడియా లో రోజుకో అప్డేట్ లీక్ అవుతోంది. రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన భారీ షెడ్యూల్ ఒకటి జోర్డాన్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ లో మూడు భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారట. అయితే ఈ షెడ్యూల్ మార్చి మొదటి వారం వరకు ప్లాన్ చేసాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. కానీ రెండు వారాలకు ముందే షూటింగ్ ని ముగించుకొని నేడు హైదరాబాద్ కి రావాల్సి వచ్చింది. కారణం కో ఆర్టిసుల డేట్స్ అందుబాటులో లేకపోవడమే. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కనిపించే యాక్షన్ షాట్స్ ని ఈ షెడ్యూల్ లో చేశారట. అదే విధంగా మలయాళం స్టార్ హీరో టోనీవో థామస్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నాడు అట.

జోర్డాన్ లో షూట్ చేసిన ఈ యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన లింక్ సన్నివేశాలు చాలానే ఉన్నాయట. ఈ సన్నివేశాల్లో కో ఆర్టిస్టులు అవసరం. అందుకే వాళ్ళ డేట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, హైదరాబాద్ లోనే సెటప్ వేసి చిత్రీకరిస్తారట. ఇకపోతే జోర్డాన్ షెడ్యూల్ తో ఈ సినిమా లోని యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి అయ్యిందట. ఇక కేవలం టాకీ పార్ట్, పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉందట. చూస్తుంటే ఈ సెప్టెంబర్ కే ఈ సినిమా షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేసేలా ఉన్నారు. డిసెంబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కి డిసెంబర్ నెల అద్భుతంగా కలిసొచ్చింది. ఈ నెలలో ‘పుష్ప’ సిరీస్ ని విడుదల చేసింది ఈ సంస్థ. ఎలాంటి సంచలన విజయం సాధించాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

అదే విధంగా ప్రశాంత్ నీల్ గత చిత్రం ‘సలార్’ కూడా ఇదే డిసెంబర్ నెలలో విడుదలై సంచలన విజయం సాధించింది. అటు డైరెక్టర్ కి , ఇటు నిర్మాతలకు బాగా కలిసొచ్చిన నెల కావడం తో ఈ నెలలో ఎలా అయినా విడుదల చెయ్యాలి అనే పట్టుదలతో ఉన్నారట మేకర్స్. మరి అది ఎంత వరకు సాధ్యం అవుతుందో చూడాలి. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది మే20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా, ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారట మేకర్స్. అంతే కాదు, అదే రోజున ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో కానీ, లేదా టీజర్ ని కాదు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular