https://oktelugu.com/

Bigg Boss 5 Telugu Siri: వామ్మో ఆ హగ్గులేంటి.. పబ్లిక్ గా సిరి పరువు తీసిన తల్లి!

Bigg Boss 5 Telugu Siri: బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ డ్రామా నడుస్తుంది. దాదాపు మూడు నెలలుగా అయినవారికి దూరంగా ఉంటున్న కంటెస్టెంట్స్ కోసం కుటుంబ సభ్యులను హౌస్ లోకి పంపుతున్నారు. ఈ సందర్భంగా సిరి తల్లి హౌస్ లోకి ఎంటరయ్యారు. అయితే ఆమె మనసులోని అసహనాన్ని అందరి ముందు బయటపెట్టి సిరి పరువు తీసింది. సిరి తల్లి శ్రీదేవి… షణ్ముఖ్ తో ముద్దులు, హగ్గులు తగ్గించాలని ఓపెన్ గా చెప్పేసింది. ఊహించని ఈ […]

Written By:
  • Shiva
  • , Updated On : November 26, 2021 / 01:57 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu Siri: బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ డ్రామా నడుస్తుంది. దాదాపు మూడు నెలలుగా అయినవారికి దూరంగా ఉంటున్న కంటెస్టెంట్స్ కోసం కుటుంబ సభ్యులను హౌస్ లోకి పంపుతున్నారు. ఈ సందర్భంగా సిరి తల్లి హౌస్ లోకి ఎంటరయ్యారు. అయితే ఆమె మనసులోని అసహనాన్ని అందరి ముందు బయటపెట్టి సిరి పరువు తీసింది. సిరి తల్లి శ్రీదేవి… షణ్ముఖ్ తో ముద్దులు, హగ్గులు తగ్గించాలని ఓపెన్ గా చెప్పేసింది. ఊహించని ఈ డైలాగ్ సిరి, షణ్ముఖ్ లకు షాక్ ఇచ్చింది. సడన్ గా ఆమె చేసిన నెగిటివ్ కామెంట్, ముఖ్యంగా సిరి మైండ్ బ్లాక్ చేసింది. షణ్ముఖ్ ఏమనుకుంటాడో అని భయపడింది.

    Bigg Boss 5 Telugu Siri

    బయట పరిస్థితుల గురించి ఇంట్లో వాళ్లకు తెలియదు. సిరి, షణ్ముఖ్ మనసులలో దురుద్దేశం లేకున్నప్పటికీ వాళ్ళ ప్రవర్తన చూస్తున్న ప్రేక్షకులకు నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడే అవకాశం కలదు. సోషల్ మీడియాలో కూడా వీరి రొమాన్స్ పై ట్రోల్స్ నడుస్తున్నాయి. దీంతో హౌస్ లోకి రావడంతోనే సిరి తల్లి శ్రీదేవి.. బరస్ట్ అయ్యారు. అయితే దాన్ని కొంచెం కవర్ చేసే ప్రయత్నం చేశారు. హౌస్ లో షణ్ముఖ్ సిరికి ఒక తండ్రిలా, అన్నలా తోడుండి కాపాడుతున్నాడని చెప్పింది.

    Also Read: ముద్దులు, హగ్గులు దాటి ఏకంగా బెడ్ పైకి… అరె ఏంట్రా ఇది!

    తల్లి శ్రీదేవి డైలాగ్ సిరికి మాత్రం షాక్ ఇచ్చింది. ఆమె కామెంట్ వలన షణ్ముఖ్ ఎక్కడ దూరమవుతాడో అని భయపడినట్లుంది. వెంటనే తల్లిని పక్కకు తీసుకెళ్లి, అందరి ముందు అలాంటి కామెంట్ ఎలా చేస్తావు, షణ్ముఖ్ బాధపడతాడని అసహనం వ్యక్తం చేసింది. నాకు అనిపించింది చెప్పాను, అని శ్రీదేవి సమర్ధించుకున్నారు. అలాంటప్పుడు నాకు పర్సనల్ గా చెప్పాల్సిందని తల్లిపై చిరుకోపం ప్రదర్శించింది.

    హౌస్ లో సిరి, షణ్ముఖ్ ల వ్యవహారం తల్లి శ్రీదేవికి ఏ మాత్రం నచ్చడం లేదని, తాజా ఉదంతంతో అర్థమైంది. ఇక హౌస్ లోకి మానస్ తల్లి, కాజల్ కూతురు వచ్చారు. నేటి ఎపిసోడ్ లో యాంకర్ రవి భార్య, కూతురు రానున్నారు. రవిని వదిలి వెళ్లలేక కూతురు కన్నీళ్లు పెట్టుకున్నట్లు ప్రోమో చూస్తే అర్థం అవుతుంది.కాగా ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఐదుగురు ఫైనల్ కి ముగ్గురు ఇంటికి వెళ్లనున్నారు.

    Also Read: షాకింగ్ సర్వే బిగ్ బాస్ విన్నర్ అతడే… యాంకర్ రవి ప్లేస్ తెలిస్తే షాక్ అవుతారు

    Tags