https://oktelugu.com/

Time Travel: ఈ సినిమాలతో మనం కూడా టైం ట్రావెల్​ చేద్దామా?

Time Travel: సినిమాలో ఎన్నో జోనర్​లు ఉన్నాయి. క్రైమ్​, రొమాంటిక్​, థ్రిల్లర్​ ఇలా రకరకాల జోనర్​లు ఉన్నాయి. ప్రేక్షకులు కూడా అందుకు తగ్గట్లుగానే వాళ్ల టేస్ట్​కు తగిన జోనర్​ను ఎంచుకుంటూ సినిమాలు చూస్తుంటారు. ఇక ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తున్న కాలంలో.. ఈ జోనర్​ విభజన మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రేక్షకులు విపరీతంగా మెచ్చిన జోనర్​లలో ఒకటి టైమ్ ట్రావెల్​. కాలంతో పాటు ప్రయాణం చేసే కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. అయితే, ఇలాంటి తరహా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 3, 2021 / 01:40 PM IST
    Follow us on

    Time Travel: సినిమాలో ఎన్నో జోనర్​లు ఉన్నాయి. క్రైమ్​, రొమాంటిక్​, థ్రిల్లర్​ ఇలా రకరకాల జోనర్​లు ఉన్నాయి. ప్రేక్షకులు కూడా అందుకు తగ్గట్లుగానే వాళ్ల టేస్ట్​కు తగిన జోనర్​ను ఎంచుకుంటూ సినిమాలు చూస్తుంటారు. ఇక ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తున్న కాలంలో.. ఈ జోనర్​ విభజన మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రేక్షకులు విపరీతంగా మెచ్చిన జోనర్​లలో ఒకటి టైమ్ ట్రావెల్​. కాలంతో పాటు ప్రయాణం చేసే కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. అయితే, ఇలాంటి తరహా చిత్రారు హాలీవుడ్​ దర్శకుడు క్రిష్టోఫర్ నోలన్ దర్శకత్వంలో ఎక్కువగా చూస్తుంటాం. కానీ, ఇండియాలోనూ కొన్ని సినిమాలు టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

    Time Travel

    నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్య 369.  1991లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సరికొత్త ట్రెండ్​ను సృష్టించింది. సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

    కాగా, వాచ్​తో టైమ్​ ట్రావెల్​ చేయొచ్చనే ఆలోచనతో వచ్చిన సినిమా 24. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాకు కె విక్రమ్​ కుమార్​ దర్శకత్వం వహించారు. సమంత హీరోయిన్​గా నటించింది. ఇందులో సూర్య హీరోగానే కాకుండా విలన్​గానూ నటించారు.

    గతం నుంచి ప్రస్తుతానికి ఓ ఫోన్​లైన్ ద్వారా కనెక్షన్​ ఏర్పడితే ఆ సినిమానే ప్లె ప్యాక్​. సుకుమార్​ అసిస్టెంట్​ హరిప్రసాద్​ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో దినేశ్​, అననన్య ప్రధాన పాత్రల్లో నటించారు. వీరిలో ఒకరు 1993లో బ్రతికుంటే, మరొకరు 2019 కాలంలో జీవిస్తూ ఉంటారు. అయితే 26 ఏళ్ల టైమ్‌ గ్యాప్‌ ఉన్న ఈ పాత్రల మధ్య సంబంధం ఏంటీ ? ఫోన్‌ కాల్స్‌ ద్వారా గతంలో జరిగిన సంఘటనలో మార్పు తీసుకొస్తే ప్రస్తుతం, భవిష్యత్తులో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో అని తెలిపేదే కథ.

    తేజ సజ్జా, శివాని రాజశేఖర్​ ప్రధాన పాత్రల్లో మాలిక్ రామ్ దర్శకత్వం వహించిన సినిమా అద్భుతం. ఈ సినిమా కూడా టైమ్​ ట్రావేల్​ నేపథ్యంలో తెరకెక్కిందే. ఇటీవలే హాట్​స్టార్​లో ఈ సినిమా విడుదలైంది.

    Also Read: ఈసారైనా నాన్న మాట విను చైతూ..!

    హీరో నాని నిర్మాతగా.. ప్రశాంత్​ వర్మ దర్శకుడిగా పరిచమైన తొలి సినిమా ఆ!. ఇందులో కాజల్ అగర్వాల్​, నిత్యా మేనన్​, ఈషా రెబ్బ, రెజీనా కసాండ్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా పూర్తిగా టైమ్ ట్రావెల్​ చిత్రం కానప్పటికీ.. అందులో ఓ చిన్న సీన్​ టైం ట్రావెల్​కు రిలేటెడ్​గా ఉంటుంది. ఆ సీన్​తోనే సినిమా మొత్తం సాగుతుంది.

    కాగా, టైమ్​ట్రావెల్​ జోనర్​లో వచ్చిన తెలుగు వెబ్​సిరీస్​ కుడి ఎడమైతే. ఈ సిరీస్​ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.

    Also Read: చిన్నారితో ప్రేమగా బాలయ్య వీడియో.. నెట్టింట్లో వైరల్​