HomeNewsTillu Square Collection: బాక్సాఫీస్ వద్ద టిల్లు స్క్వేర్ సునామి... 19 రోజులకు ఎన్ని కోట్లు...

Tillu Square Collection: బాక్సాఫీస్ వద్ద టిల్లు స్క్వేర్ సునామి… 19 రోజులకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Tillu Square Collection: సిద్ధూ జొన్నలగడ్డ టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో రేసులో దూసుకు వచ్చాడు. డీజే టిల్లు మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన సిద్ధూ.. దాని సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో అంతకు మించిన విజయం సాధించాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో టిల్లు స్క్వేర్ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. టిల్లు స్క్వేర్ విడుదలై మూడు వారాల కావస్తున్నా ఆ చిత్ర జోరు తగ్గలేదు. సాలిడ్ వసూళ్లు సాధిస్తుంది. పెద్దగా పోటీ లేకపోవడం, ఫ్యామిలీ స్టార్ నిరాశ పరచడం టిల్లు స్క్వేర్ కి కలిసొచ్చింది.

టిల్లు స్క్వేర్ 19వ రోజు ఏపీ/తెలంగాణలలో రూ. 75 లక్షలు వసూలు చేసింది. యూఎస్ వసూళ్లతో కలుపుకుని మొత్తంగా రూ. 1.20 కోట్ల రూపాయలు రాబట్టింది. ఇప్పటి వరకు టిల్లు స్క్వేర్ మూవీ వరల్డ్ వైడ్ రూ. 126 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఒక్క యూఎస్ లోనే $3 మిలియన్ వసూళ్లు సాధించింది. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే రూ. 30 కోట్లు. టిల్లు స్క్వేర్ బడ్జెట్ రీత్యా టిల్లు స్క్వేర్ రూ. 50 కోట్ల రూపాయల లాభాలు పంచినట్లు లెక్క.

2022లో విడుదలైన డీజే టిల్లు సైతం భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఈ రెండు చిత్రాలు చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ కి సిద్ధూ జొన్నలగడ్డ బంగారు గనిలా దొరికాడు. అదే సమయంలో సిద్ధూ ఇమేజ్ ని ఈ రెండు చిత్రాలు పూర్తిగా మార్చేశాయి. టైర్ టు హీరోల జాబితాలో చేరాడు సిద్ధూ. ఒక సపరేట్ ఇమేజ్, మేనరిజం తో యూత్ లో ఫాలోయింగ్ సంపాదించాడు.

టిల్లు స్క్వేర్ చిత్రానికి మాలిక్ రామ్ దర్శకత్వం వహించాడు. సిద్ధూ జొన్నలగడ్డకు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ చిత్రంలో ఆమె గ్లామరస్ రోల్ చేయడం విశేషం. తన హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ ఈ చిత్రంతో బ్రేక్ చేసింది. అనుపమను ఇలాంటి పాత్రలో చూసి అభిమానులు నొచ్చుకోవడం కొసమెరుపు. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేస్తే బోర్ కొట్టేస్తుందని అనుపమ సమర్ధించుకుంది.

Exit mobile version