Pawan Kalyan : జనసేన.. ఈ మార్చి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో మూడు రోజుల ప్లీనరీ సమావేశాలు జరుగబోతున్నాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేటట్లు అయితే 2014 మార్చి 14న హైటెక్ సిటీ ఎగ్జిబిషన్ సమావేశాన్ని అందరూ ఆసక్తిగా చూశారు. వెంటనే రెండు నెలల్లో వచ్చిన ఎన్నికల్లో చంద్రబాబు అనుభవం అవసరమని టీడీపీకి మద్దతు తెలిపారు. దేశానికి మోడీ అవసరమని బీజేపీకి మద్దతుగా నిలిచారు.
2019కి వచ్చేసరికి జనసేన తరుఫున ఒంటరిగా పోటీచేశారు. పోటీచేసిన రెండు చోట్ల పోటీచేసి ఓడిపోయారు. ఒకే ఒక్క సీటు గెలిచారు. ఓటమి చెందినా.. ఆర్థిక భారం వెంటాడినా వెన్ను చూపలేదు. పవన్ రాజకీయాలను మలుపు తిప్పిందే ఆ సంఘటన.. ఓటమి చెందినా ప్రజల మధ్య ఉండడం మొదలుపెట్టాడో జనంలో ఆయనపై నమ్మకం పెరిగింది. 2024కి ఆయన నమ్మకం పెరిగిపోయి 3వ ఫ్రంట్ కడుతారనుకున్నారు. కానీ చంద్రబాబు అరెస్ట్ తో వాస్తవ ప్రాక్టికల్ గా ఆలోచించి .. బలబలాలు అంచనావేసి ఒక వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. మోడీ, చంద్రబాబును కలిపి కూటమి విజయానికి తోడ్పడ్డారు.
ఇప్పుడు పవన్ అధికారంలో ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పెద్ద పదవిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్లీనరీ సమావేశాలు ఆసక్తి రేపుతున్నాయి.
పవన్ కళ్యాణ్ అధికారిక పదవితో జరుగుతున్న మొదటి జనసేన సమావేశాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.