Game Changer Review : రామ్ చరణ్(Ram Charan)-శంకర్ కాంబోలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం గేమ్ ఛేంజర్(Game Changer). సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. గేమ్ ఛేంజర్ పక్కా పొలిటికల్ థ్రిల్లర్. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. సామాజిక సమస్యలను ఇతివృత్తంగా తీసుకుని కమర్షియల్ అంశాలతో సినిమాలు చేయడం శంకర్(Shankar) కి వెన్నతో పెట్టిన విద్య. ఇక శంకర్ తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ ఒకే ఒక్కడు ట్రెండ్ సెట్టర్. అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో బాక్సాఫీస్ షేక్ చేసింది. ఒకే ఒక్కడు మూవీలో ఆయన ఒక్కరోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్ పరిచయం చేశాడు.
ఒకే ఒక్కడు హిందీలో రీమేక్ చేశారు. నాయక్ పేరుతో శంకర్ అనిల్ కపూర్ హీరోగా తెరకెక్కించి హిట్ కొట్టారు. మరలా ఇన్నేళ్లకు అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్ చిత్రాన్ని శంకర్ తెరకెక్కించారు. గేమ్ ఛేంజర్ ట్రైలర్ సైతం ఆకట్టుకుంది. దాంతో అంచనాలు పెరిగాయి. కాగా గేమ్ ఛేంజర్ మూవీ ఎలా ఉందో రివ్యూ ఇచ్చేశాడు ఉమర్ సంధు. యూఏఈ సెన్సార్ సభ్యుడు, ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు… మూవీ విడుదలకు ముందే సెన్సార్ సభ్యుడిగా సినిమా చూసి రివ్యూ ఇస్తాడు.
ఉమర్ సంధు టాలీవుడ్ బడా హీరోల చిత్రాలకు ఖచ్చితంగా రివ్యూలు ఇస్తారు. గేమ్ ఛేంజర్ సైతం చూశానంటూ ఆయన ట్వీట్ చేశాడు. ఇక గేమ్ ఛేంజర్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు అనేది, ఉమర్ సంధు అభిప్రాయం. రామ్ చరణ్ అభిమానులు పూర్తిగా నిరాశ చెందేలా ఉమర్ సంధు రివ్యూ ఉంది. గేమ్ ఛేంజర్ సిల్వర్ స్క్రీన్ పై వర్క్ అవుట్ కాలేదు. శంకర్, రామ్ చరణ్ కెరీర్స్ లో ఇప్పటి వరకు ఇదే వీక్ మూవీ. అవుట్ డేటెడ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్. సినిమా బోరింగ్.. సారీ రామ్ చరణ్ ఫ్యాన్స్, అంటూ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు.
అయితే ఉమర్ సంధు రివ్యూని విశ్వసించాల్సిన అవసరం లేదనే వాదన వినిపిస్తుంది. గతంలో చాలా సందర్భాల్లో ఉమర్ సంధు రివ్యూలు విఫలం చెందాయి. డిజాస్టర్ మూవీస్ కి కూడా ఆయన 4 స్టార్ రేటింగ్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే బ్లాక్ బస్టర్ మూవీస్ కి డిజాస్టర్ రేటింగ్ ఇచ్చిన సందర్భం కూడా ఉంది. కాబట్టి రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉమర్ సంధు రివ్యూ పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదని అంటున్నారు.
First Review #GameChanger from Overseas Censor Board: It doesn’t work. It is #Shankar’s & #RamCharan weakest film to date! Cringe & Poor performances by all leading actors. Boring & Outdated Story, Screenplay & Dialogues. Sorry for #RamCharan Fans !!! This film is Torture.
⭐️⭐️ pic.twitter.com/9ixtZtI2OG
— Umair Sandhu (@UmairSandu) January 5, 2025
Web Title: Top critic umair sandhu gives first review of game changer which is going viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com