https://oktelugu.com/

Bollywood : బాలీవుడ్ కి భారీ సక్సెస్ రావాలంటే ఇదొక్కటే దారి…లేకపోతే ఇక వాళ్ళు షెడ్డుకి వెళ్ళాల్సిందే…

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటినుంచి పాన్ ఇండియాలో సినిమాలు మంచి విజయాలను సాధిస్తూ సూపర్ సక్సెస్ గా నిలుస్తున్నాయి... ఇక ఏది ఏమైనా కూడా మన సినిమా తమదైన రీతిలో రావడమే కాకుండా సూపర్ సక్సెస్ లుగా నిలిచే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : December 21, 2024 / 10:32 PM IST

    Bollywood Star Heros

    Follow us on

    Bollywood :  ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ భారీ సక్సెస్ ను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూ ఉండేది. ఇక అందులో భాగంగానే ఖాన్ త్రయంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉండేవారు. మరి అలాంటి సందర్భంలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్లకు సరైన సక్సెస్ అయితే రావడం లేదు. కారణం ఏదైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇక ఏది ఏమైనా కూడా షారుక్ ఖాన్ మాత్రం అడపదడప సినిమాలను చేస్తూ మంచి సక్సెస్ లను అందుకుంటున్నాడు. ఇక పఠాన్, జవాన్ లాంటి రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ఆయన ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ ఖాన్ త్రయం గా పిలవబడుతున్న వీళ్ళ ముగ్గురు తమదైన రీతిలో సక్సెస్ ని సాధించి 1500 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీ ఇక కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయే పరిస్థితి అయితే ఎదురవుతుంది. ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోలేక వాళ్ళు చతికల పడిపోయారు. మరి ఇక మీదట కూడా వాళ్లు అలానే ఉంటారా? లేదంటే మంచి గుర్తింపును సంపాదించుకునే విధంగా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతారా? అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.

    ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ మరోసారి పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటాలంటే మాత్రం వాళ్ళు భారీ గుర్తింపును సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలో వాళ్లు ఎలాంటి సినిమాలు సాధించబోతున్నారనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…

    ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు బాలీవుడ్ దిగ్గజ హీరోలకు పోటీగా తయారయ్యారు. మరి వాళ్ళందరినీ డామినేట్ చేస్తూ ముందుకు సాగాలంటే వాళ్లు ఒక పెద్ద సాహసమైతే చేయాల్సి ఉంటుంది. మరి దానికి తగ్గట్టుగానే వాళ్ళు సినిమాలను చేస్తూ ముందుకు సాగుతారా లేదంటే ఇక సినిమాలేవి చేయకుండా కామ్ గా ఉండిపోతారా అనేది కూడా తెలియాల్సి ఉంది.

    ఇక ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రమే బాలీవుడ్ కి ఈ అవకాశం అయితే ఉంది. ఇక కొన్ని రోజులు గడిస్తే మాత్రం ఈ అవకాశం కూడా ఉండేలా లేదనే చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని మన హీరోలు కబ్జా చేసేస్తారు. కాబట్టి వాళ్ల సినిమాలు వచ్చినా కూడా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా ఉండకపోవచ్చు…