Best selling cars in January: కాలం మారుతున్న కొద్దీ వినియోగదారుల అభిరుచులు మారిపోతున్నాయి. కార్ల కొనుగోలు విషయంలో ఒకప్పటి ఆలోచన ప్రస్తుతం ఉండడం లేదు. ఒకప్పుడు కేవలం బడ్జెట్లోనే చిన్న కారు కొనాలని చూసేవారు. కానీ ఇప్పుడు అవసరాలతో పాటు.. సౌకర్యవంతంగా కారు ఉండాలని అనుకుంటున్నారు. దీంతో SUV కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. నగరాల్లో ఉండే వారితో పాటు విహారయాత్రలకు వెళ్లాలని అనుకునేవారు ఈ వేరియంట్ కార్లు ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే కొత్త ఏడాది సందర్భంగా గత నెలలో SUV కార్ల అమ్మకాలను పరిశీలిస్తే టాప్ త్రీ లో మూడు కార్లు నిలుస్తున్నాయి. ఆ కార్లు ఏవో ఇప్పుడు చూద్దాం..
దేశంలో నెంబర్ 2 గా ఉంటున్న TATA కంపెనీ మార్కెట్లో వినియోగదారులకు అనుగుణంగా SUV కార్లను తీసుకువస్తుంది. ఇందులో భాగంగా గత నెలలో ఈ కంపెనీ నుంచి Nexon కారును ఎక్కువగా కొనుగోలు చేశారు. 2026 జనవరి మొత్తంలో దీనిని 23,365 మంది కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది 2025 జనవరిలో 15,397 యూనిట్లు ఉండగా ఈ ఏడాది 19% అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ కారు ధర రూ.7.32 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.14.05 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పనిచేస్తుంది. పెట్రోల్ తో పాటు CNG ఆప్షన్ కూడా ఇందులో అమర్చారు.
గత నెలలో ఎక్కువగా విక్రయాలు జరుపుకున్న కార్లలో ఇదే కంపెనీకి చెందిన Punch నిలుస్తుంది. ఈ కారు 2025 జనవరిలో 16,231 యూనిట్లు విక్రయాలు జరగగా.. ఈ ఏడాది జనవరిలో 19, 257 యూనిట్లు జరుపుకుంది. ఈసారి కూడా గత ఏడాది కంటే ఇప్పుడు 19 శాతం అమ్మకాలు ఎక్కువగా జరుపుకుంది. ఈ కారు ధర రూ.5.49 లక్షలు గా ఉంది. SUV వేరియంట్ లో తక్కువ ధరకు ఈ కారు రావడంతో చాలామంది దీనిని కొనుగోలు చేస్తున్నారు.
దేశంలో నెంబర్ వన్ కంపెనీగా పేరు తెచ్చుకున్న మారుతి సుజుకి నుంచి కాంపాక్ట్ SUV కారు అయిన Brezza 2026 జనవరిలో 17486 యూనిట్లు జరుపుకుంది. గత ఏడాది జనవరిలో దీని సంఖ్య 14,747 యూనిట్లు ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ కారు సైతం 19% తమకాల ఎక్కువగా జరుపుకుంది. ఈ కారు ధర రూ.8.25 లక్షలు గా ఉంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు CNG ఆప్షన్ కూడా ఉంది.
ఈ విధంగా గత నెలలో ఈ మూడు కార్లు ఎక్కువగా విగ్రహాలు జరుపుకున్నట్లు తెలుస్తోంది. చాలామంది వినియోగదారులు ఇంజన్ పనితీరులతో పాటు అత్యధిక మైలేజ్ ఇచ్చే కారుల వైపు చూస్తున్నారు. ఈ విభాగంలో ఈ మూడు కార్లు టాప్ త్రీ లో నిలుస్తున్నాయి. అయితే ఇవి ఫిబ్రవరి నెలలో ఎలాంటి అమ్మకాలు జరుపుకుంటాయో చూద్దాం.