HomeNewsPoorest Countries: ప్రపంచంలో టాప్‌ 10 పేద దేశాలు ఇవే.. జాబితాలో కనిపించని దాయాది దేశం!

Poorest Countries: ప్రపంచంలో టాప్‌ 10 పేద దేశాలు ఇవే.. జాబితాలో కనిపించని దాయాది దేశం!

Poorest Countries: ప్రపంచంలో అనేక సంస్థలు ఆయా దేశాల స్థితిగతులు, జీవనవిధానం, పర్యాటకుల రాక, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ర్యాంకులు ఇస్తున్నాయి. ప్రపంచంలో ప్రస్తుతం 195 దేశాలు ఉన్నాయి. వీటిలో అత్యంత పేదరికం(Poorest)లో ఉన్న పది దేశాల జాబితాను ఫోర్బ్స్‌(Forbs) విడుదల చేసింది. ఈ సూచీలో టాప్‌లో నిలిచిన దేశాలలో అతి చిన్న దేశాలే. వీటిలో భారత్‌కు సన్నిహితమైన మడగాస్కర్‌ కూడా ఉంది. ఇక ఈ జాబితాలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ పేర్లు లేకపోవడం గమనార్హం.

1. దక్షిణ సూడాన్‌
దక్షిణ సూడాన్‌(South soodan) ప్రపంచంలో అత్యంత పేద దేశంగా గుర్తింపు పొందింది. ఈ దేశంపు జీడీపీ కేవలం 29.99 బిలియన్‌ డాలర్లు. దక్షిణ సూడాన్‌ జనాభా 1.11 కోట్లు ఈ దేశంలో అత్యధిక శాతం యువత ఉంది. 2011లో ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఈ దేశంలో అత్యధిక జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది.

2. బురుండీ
పేదరిక జాబితాలో రెండో స్థానంలో ఉన్న దేశం బురుండీ(Burundi). మధ్య ఆఫ్రికాలోని బురుండీ జీడీపీ 2.15 బిలియన్‌ డాలర్లు. ఇక్కడ జనాభా 1,34,59,236. రాజకీయ అస్థిరత, అంతర్గత ఘర్షణలు ఈ దేశపు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. దేశంలోని 80 శాతం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడుతుంది.

3. సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌..
సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌(Central republic African) ప్రపంచంలో పేదరికంలో మూడోస్థానంలో ఉంది. ఇక్కడి జనాభా 58,49,358. జీడీపీ 3.03 బిలియన్‌ డాలర్లు. రాజకీయ అస్థిరత, సాయుధ పోరాటం, మౌలిక సదుపాయాల కొరతతో ఈ దేశం తీవ్రమైన ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటోంది. ఈ దేశంలో 80 శాతం జనాభా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు.

4. మలావి..
ప్రపంచంలో పేదరికంలో నాలుగో స్థానంలో ఉన్న దేశం మలావి. ఇక్కడ 2,13,90,465. జీడీపీ 10.78 మిలియన్‌ డాలర్లు. మలావి కూడా గణనీయమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. వర్షాధార వ్యవసాయంపై ఇక్కడ పంటలు సాగుచేస్తుంటారు. ఇక్కడి ప్రభుత్వం విద్య, ఆరోగ్యం మెరుగుపర్చడానికి, పేదరికం తగ్గించడానికి చర్యలు తీసుకుంటోంది.

5. మొజాంబిక్‌
పేదరికంలో మొజాంబిక్‌ ప్రపంచంలో ఐదోస్థానంలో ఉంది. మొజాంబిక్‌ జనాభా 3,44,97,736. ఈ దేశ జీడీపీ 24.55 బిలియన్‌ డాలర్లు. మెజాంబిక్‌లో ఉగ్రవాదం, హింస ప్రధాణ సమస్యలు. ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు, జనాభా పెరుగుదల దేశానిన్న పేదరికంలోకి నెట్టేశాయి.

6. సోమాలియా
ప్రపంచంలో పేదరికం జాబితాలో ఆరోస్థానంలో నిలిచింది సోమాలియా(Somalia). ఈ దేశ జనాభా 1,90,09,151. జీడీపీ 13.89 బిలియన్‌ డార్లు. సోమాలియాలో అంతర్యుద్ధం ఆ దేశాన్ని పేదరికంలోకి నెడుతోంది. ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తోంది.

7. కాంగో డెమొక్రాటిక్‌ రిపబ్లిక్‌
కాంగో డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ దేశం పేదరికంలో ప్రపంచంలో ఏడో స్థానంలో ఉంది. ఈ దేశ జనాభా 10,43,54,615. జీడీపీ 79.24 బిలియన్‌ డాలర్లు. ఈ దేశం కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. రువాండా అనుకూల తిరుగుబాటుదారుల దాడులతో అతలాకుతలమవుతోంది. దేశంలో 60 శాతానికిపైగా జనాభా రోజుకు రూ.180 కన్నా తక్కువ ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు.

8. లైబీరియా
మరో ఆఫ్రికా దేశం లైబీరియా పేదరికంలో ప్రపంచంలో 8వ స్థానంలో ఉంది. ఈ దేశ జనాభా 54,92,486. ఆఫ్రికన్‌ దేశమైన లైబీరియాలో అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ కారణంగా పేదరికంలోకి నెట్టివేయబడింది. ప్రపంచ ఆహార కార్యక్రమం వంటి అంతర్జాతీయ సంస్థలు విద్య, ఆరోగ్య సంరక్షణలో సహకారం అందిస్తున్నాయి.

9. యెమెన్‌..
ప్రపంచంలో పేదరిక దేశాలలో యెమెన్‌(Yemen) 9వ స్థానంలో ఉంది. యెమెన్‌ జీడీపీ 16.22 బిలియన్‌ డాలర్లు. జనాభా 34.4 మిలియన్లు. ఏళ్లతరబడి సాగుతున్న అంతర్యుద్ధం, రాజకీయ అనిశ్చితి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. ఆహారం, నీరు, మందులు, నిత్యావరసర సరుకుల కొరత ఇక్కడి ప్రజలను వెంటాడుతున్నాయి.

10. మడగాస్కర్‌
పేదరికంలో పదో స్థానంలో ఉన్న మరో దేశం మడగాస్కర్‌. ఇది భారత్‌కు స్నేహ దేశం. ఇక్కడ జనాభా 30.3 మిలయన్లు. జీడీపీ 18.1 బిలియన్‌ డాలర్లు. మడగాస్కర్‌ ఆఫ్రికాకు ఆగ్న్రేయ తీరంలో ఉన్న ద్వీపదేశం. మైనింగ్, పర్యాటకం ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular