Windows: పురుషులతో పాటు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అంతరిక్షంలోకి సైతం వెళ్లి తమ సత్తా చాటుతున్నారు. అకాసంలో సగం ఆడవాళ్లే అని అంటారు. కానీ అక్కడ మాత్రం మహిళల పరిస్థితి దారుణంగా మారింది. అడుగడుగునా ఆంక్షలు ఎదుర్కొంటూ అణచివేతకు గురవుతున్నారు. కనీసం ఇంట్లో నుంచి అడుగుపెట్టాలంటే కూడా మగవారి తోడు ఉండాల్సిందే. కొత్త వారిని చూసేందుకు తలెత్తకూడదు. ఓ వైపు టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ అన్ని రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్న తరుణంలో ఇక్కడ మాత్రం మహిళలను అణచివేస్తున్నారు. ఇది ఎక్కడంటే…?
తాలిబాన్ల చేతికి వచ్చాక అప్ఘనిస్తాన్ దేశంలో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఇప్పటికే ఇక్కడ మహిళలు సరిగ్గా శిరస్త్రాణాన్ని సరిగ్గా ధరించలేదని కఠినమైన చర్యలు తీసుకున్నారు. తాజాగా కొత్త నిబంధనలు చేర్చారు. కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారు ఇంటికి కిటికీలు ఉండకూడదని నిబంధనలు విధించారు. మహిళలు ఎక్కువ సమయం ఉండే వంట గదిలో, బావుల వద్ద ఇవి కచ్చితంగా లేకుండా ఉండాలని చెప్పారు. మహిళలు బావుల వద్దకు ఎక్కువగా వెళ్తారు. అందువల్ల చుట్టూ గోడలు నిర్మించాలని చెప్పారు. ఈ మేరకు తాలిబాన్ కు సంబంధించిన సుప్రీం లీడర్ ఈ నిబంధనలు జారీ చేశారు.
ఇప్పటికే అప్ఘనిస్తాన్ దేశంలో మహిళలు ఒంటరిగా నడిచే హక్కును కోల్పోయారు. వీరు బయటకు వెళ్లాలంటే మగవారి తోడు కచ్చితంగా ఉండాలనే నిబంధనను చేర్చారు. బాలికలు చదువుకోవడానికి వీల్లేదని చెప్పారు. ఇందులో భాగంగా బాలికలకు సంబంధించిన సెకండరీ స్కూళ్లను మూసివేశారు. మహిళలు ఉద్యోగాల నుంచి తప్పుకోవాలని, ఇంటికే పరిమితం కావాలని ఆదేశించారు. వీరు ఉన్నత చదువులపై ఆశలు వదులుకోవాలని అన్నారు. మహిళలు ఏ కార్యాలయాల్లో పనిచేసినా వాటి అనుమతి రద్దు చేస్తామని అన్నారు.
అప్ఘనిస్తాన్ లో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఇప్పటికే ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మహిళలపై దారుణ వివక్ష అని పేర్కొంది. కానీ అప్ఘానిస్తాన్ లోని తాలిబాన్లు మాత్రం పట్టించుకోవడం లేదు. మహిళలకు సంబంధించిన బ్యూటీ సెలూన్లు నడపకూడదని, జిమ్ లు, పార్కల్లో మహిళలు కనిపించకూడదని ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా ఇక్కడి మహిళలు బయటి వారికి కనిపించకుండా ఉండాలి. ఇంట్లో నుంచి బయటకు వెల్లాలంటే ఇంట్లోని మగవారితో మాత్రమే కలిసి రావాలి. ఒకవేళ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తాము అధికారంలోకి వస్తే ప్రజలకు స్వేచ్ఛ ఇస్తామని ప్రకటించిన తాలిబాన్లు ఆ తరువాత అరాచకాలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. 2021 ఆగస్టులో ఆప్ఠనిస్తాన్ ను తాలిబాన్లు అప్ఘనిస్తాన్ లో పరిపాలన మొదలు పెట్టారు. అయితే వీరు మహిళలపై మాత్రం కఠినంగా నిబంధనలు అమలు చేస్తూ వారిని అణచివేతకు గురి చేస్తున్నారు.