https://oktelugu.com/

Death: పని ఒత్తిడి ప్రాణం తీసింది.. భరించలేనంటూ దూకి చనిపోయింది..

బతకడానికి పనిచేయాలి.. ఆ పని హుందాగా ఉండాలి.. ఎక్కువ ఆదాయం రావాలి.. అని కోరుకునేవారు కొందరు ఉంటారు. మరికొందరు మాత్రం ఆదాయంతో పని లేకుండా ఉద్యోగం సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : January 10, 2025 / 11:50 AM IST

    Kota satya lavanya

    Follow us on

    Death: బతకడానికి పనిచేయాలి.. ఆ పని హుందాగా ఉండాలి.. ఎక్కువ ఆదాయం రావాలి.. అని కోరుకునేవారు కొందరు ఉంటారు. మరికొందరు మాత్రం ఆదాయంతో పని లేకుండా ఉద్యోగం సౌకర్యవంతంగా ఉండాలని కోరుకుంటారు. ఉద్యోగాలన్నింటిలో బ్యాంకు ఉద్యోగం చాలా సౌకర్యవంతంగా ఉంటుందని కొందరి భావన. అందుకే చాలా మంది బ్యాంకు జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా యువతులు బ్యాంకు జాబ్ చేయడానికి చాలా ఇష్టపడుతారు. కానీ ఇప్పుడు బ్యాంకు జాబ్ కూడా భారమైంది అని తెలుస్తోంది. బ్యాంకులో పనిచేసే ఓ మహిళ పని ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. దీంతో ఏం చేయలేక బలవన్మరణానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?

    భర్త ఐటీ ఉద్యోగం.. ఆమెది బ్యాంకు జాబ్.. ఇద్దరు కన్వినెంట్ రంగాల్లో ఉన్నందున వారి లైఫ్ హ్యపీ అనుకున్నారంతా. అయితే నేటి కాలంలో ప్రతి పని ఒత్తిడిగా మారిపోతుంది. ముఖ్యంగా బ్యాంకులో పనిచేసేవారు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆర్థిక వ్యవహారాలన్నీ బ్యాంకు ద్వారానే జరుగుతున్నందన ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. దీంతో ఈ జాబ్ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. అయినా ఒక్కోసారి పని భారం తట్టుకోలేకపోతారు. ఇలాగే ఓ మహిళ పని ఒత్తిడికి బలి కావాల్సి వచ్చింది.

    ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం పట్టణానికి చెందిన కోట సత్య లావణ్యతో అదే ప్రాంతానికి చెందిన బత్తుల వీర మోహన్ తో 5 సంవత్సరాల కిందట వివాహం అయింది. ఉద్యోగ రీత్యా వీరు హైదరాబాద్ కు వచ్చారు. హైదరాబాద్ లోని బాచుపల్లి కేఆర్సీఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. భర్త ఓ సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తుండగా.. లావణ్య గాంధీనగర్ లోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తోంది. అయితే కొన్నాళ్లుగా బ్యాంకులో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని బంధువుల వద్ద చెప్పింది.

    అయితే సంక్రాంతి సందర్భంగా శుక్రవారం సొంతూరుకు వెళ్లడానికి ప్లాన్ లో భాగంగా గురువారం మధ్యాహ్నమే విధులు ముగించుకొని ఇంటికి చేరింది. నేరుగా అపార్టమెంట్ లోకి వెళ్లిన ఆమె భవనం పై నుంచి కిందికి దూకింది. తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆమెను ఎస్ఎల్ జి ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు విడిచింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొన్నాళ్లుగా పని ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. అయితే ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

    ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది.  చాలా మంది పని ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ముఖ్యంగా మహిళలు ఇంట్లో వ్యవహారాలు చూసుకోవడంతో పాటు కార్యాలయాల్లో పనిచేయడం వల్ల తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో పనిచేసేవారు కీలకంగా ఉంటారు. అందువల్ల వీరు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే ఒత్తిడిని తగ్గించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కొందరు నిపుణులు అంటున్నారు. మహిళలు ఏ రంగంలో పనిచేసినా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలి అని సూచిస్తున్నారు.